నా రికార్డులను జైస్వాల్‌ బద్దలు కొడతాడు

టీమ్‌ఇండియా యువ ఓపెనర్‌, ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించే యశస్వి జైస్వాల్‌కు గొప్ప భవిష్యత్తు ఉందని వెస్టిండీస్‌ దిగ్గజ బ్యాటర్‌ బ్రయాన్‌ లారా కొనియాడాడు.

Updated : 09 May 2024 02:39 IST

దిల్లీ: టీమ్‌ఇండియా యువ ఓపెనర్‌, ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించే యశస్వి జైస్వాల్‌కు గొప్ప భవిష్యత్తు ఉందని వెస్టిండీస్‌ దిగ్గజ బ్యాటర్‌ బ్రయాన్‌ లారా కొనియాడాడు. అతను టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (400 నాటౌట్‌) సహా తన పేరిట ఉన్న రికార్డులను బద్దలు కొట్టగలడని అభిప్రాయపడ్డాడు. ‘‘నా రికార్డులకు ముప్పు ఉందని, వాటిని జైస్వాల్‌ అందుకోగలడని భావిస్తున్నా. అతడిలో ఆ సామర్థ్యం ఉంది. ఇప్పటికే టెస్టుల్లో రెండు డబుల్‌ సెంచరీలు సాధించాడు. జైస్వాల్‌ ఎంతో అణకువతో కనిపిస్తాడు. కష్టపడడానికి సిద్ధంగా ఉంటాడు. తొలిసారి అతణ్ని కలిసినపుడే ఆత్మీయ బంధం కలిగింది. నా నుంచి చాలా తెలుసుకోవాలని ప్రయత్నించాడు’’ అని లారా చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని