మూడేళ్లలో తొలిసారి..

ఒలింపిక్‌, ప్రపంచ ఛాంపియన్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా మూడేళ్లలో తొలిసారి స్వదేశంలో పోటీపడనున్నాడు. భువనేశ్వర్‌లో ఈ నెల 12 నుంచి 15 వరకు జరిగే జాతీయ ఫెడరేషన్‌ కప్‌లో అతడు ఆడనున్నాడు.

Published : 09 May 2024 02:21 IST

దిల్లీ: ఒలింపిక్‌, ప్రపంచ ఛాంపియన్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా మూడేళ్లలో తొలిసారి స్వదేశంలో పోటీపడనున్నాడు. భువనేశ్వర్‌లో ఈ నెల 12 నుంచి 15 వరకు జరిగే జాతీయ ఫెడరేషన్‌ కప్‌లో అతడు ఆడనున్నాడు. ‘‘నీరజ్‌ చోప్రా, కుమార్‌ జెనా భువనేశ్వర్‌లో జరిగే ఫెడరేషన్‌ కప్‌లో పోటీపడనున్నారు’’ అని భారత అథ్లెటిక్‌ సమాఖ్య ట్వీట్‌ చేసింది. చోప్రా కోచ్‌ క్లాస్‌ బర్తోనీజ్‌ కూడా ఈ ఈవెంట్లో నీరజ్‌ పాల్గొనే విషయాన్ని ధ్రువీకరించాడు. ఈ ఈవెంట్లో జావెలిన్‌ క్వాలిఫయింగ్‌ రౌండ్‌ 14న, ఫైనల్‌ 15న జరుగుతాయి. చోప్రా చివరిసారి 2021లో ఫెడరేషన్‌ కప్‌లో పోటీపడ్డాడు. అప్పుడు 87.80 మీటర్ల త్రోతో స్వర్ణం గెలిచాడు. చోప్రా టోక్యో ఒలింపిక్‌ స్వర్ణం గెలిచాక 2022లో డైమండ్‌ లీగ్‌ ఛాంపియన్‌గా, 2023లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. ఆసియా క్రీడల్లో పసిడి సాధించాడు. అయితే నీరజ్‌ ఇప్పటివరకు 90 మీటర్ల దూరాన్ని అందుకోలేకపోయాడు. 89.94మీ. ఇప్పటివరకు అతడి వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని