శాంసన్‌.. మాస్టర్‌ బ్లాస్టర్‌!

ఈ ఐపీఎల్‌లో భీకర ఫామ్‌తో సాగిపోతున్న రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజు శాంసన్‌పై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్‌ మాథ్యూ హేడెన్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. అతణ్ని మాస్టర్‌బ్లాస్టర్‌గా అభివర్ణించాడు.

Published : 09 May 2024 02:18 IST

దిల్లీ: ఈ ఐపీఎల్‌లో భీకర ఫామ్‌తో సాగిపోతున్న రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజు శాంసన్‌పై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్‌ మాథ్యూ హేడెన్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. అతణ్ని మాస్టర్‌బ్లాస్టర్‌గా అభివర్ణించాడు. దిల్లీపై గత మ్యాచ్‌లో రాజస్థాన్‌ ఓడినప్పటికీ.. శాంసన్‌ ఇన్నింగ్స్‌ అమోఘమని హేడెన్‌ అన్నాడు. ‘‘సంజు శాంసన్‌ కల లాంటి ఫామ్‌లో ఉన్నాడు. దిల్లీపై 46 బంతుల్లోనే 86 పరుగులు చేయడం ద్వారా తన ప్రతిభను మరోసారి చాటాడు. టోర్నీలో ఆరంభం నుంచి అతను మాస్టర్‌ బ్లాస్టర్‌లా ఆడుతున్నాడు. స్పిన్‌, పేస్‌ రెంటినీ గొప్ప నైపుణ్యంతో ఎదుర్కొంటున్నాడు. అతడిలో గొప్ప టైమింగ్‌ ఉంది. అలాగే శక్తికీ లోటు లేదు. టీ20ల్లో శక్తి చాలా కీలకం. జట్టు కోసం తన పట్టుదల అన్నింటికంటే గొప్పది’’ అని చెప్పాడు

సంజుకు జరిమానా: దిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజు శాంసన్‌కు మ్యాచ్‌ ఫీజులో 30 శాతం జరిమానా పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు