IND vs NZ: ‘శుభ్‌మన్‌ గిల్‌ స్థానంలో అతడిని తీసుకోండి.. అద్భుతాలు చేయగలడు’

కివీస్‌తో జరిగిన రెండు టీ20ల్లో విఫలమైన శుభ్‌మన్‌ గిల్ (Shubman Gill) స్థానంలో యువ ఆటగాడు పృథ్వీ షా (Prithvi Shaw)ను తుదిజట్టులోకి తీసుకోవాలని పాక్ మాజీ స్పిన్నర్‌ డానిష్‌ కనేరియా భారత జట్టు యాజమాన్యానికి సూచించాడు. 

Published : 01 Feb 2023 01:20 IST

ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఓ డబుల్ సెంచరీ, సెంచరీ బాదిన శుభ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) .. అదే జట్టుతో జరుగుతోన్న టీ20 సిరీస్‌లో మాత్రం పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. తొలి టీ20లో ఏడు పరుగులకే పెవిలియన్ చేరిన అతడు.. రెండో టీ20 11 పరుగులే చేసి నిరాశపర్చాడు. రంజీ ట్రోఫీలో ట్రిపుల్‌ సెంచరీ బాది తిరిగి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న పృథ్వీ షా (Prithvi Shaw)కు శుభ్‌మన్‌ గిల్‌ స్థానంలో అవకాశం కల్పించాలని భారత జట్టు యాజమాన్యానికి పాక్‌ మాజీ స్పిన్నర్ డానిష్‌ కనేరియా సూచించాడు.

‘శుబ్‌మన్ గిల్ ఎలా ఆడతాడో మీరు చూశారు. పృథ్వీ షా అద్భుతమైన యువ క్రికెటర్. అతడు దూకుడుగా ఆడతాడు. శుభ్‌మన్ గిల్ స్థానంలో పృథ్వీ షాకి అవకాశం ఇవ్వండి. అతడి దగ్గర నైపుణ్యం ఉంది. పృథ్వీ షా నిలకడగా ఆడితే అద్భుతాలు చేయగలడు. శుభ్‌మన్‌ గిల్ అద్భుతమైన బ్యాటర్‌. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ, గిల్‌ తన బ్యాటింగ్‌లోని లోపాలను సరిదిద్దుకోవడంపై దృష్టిపెట్టాలి. స్పిన్‌ బౌలింగ్‌ని ఎదుర్కోవడంలో అతడు ఇంకా మెరుగవ్వాల్సి ఉంది’ అని కనేరియా వివరించాడు. శుభ్‌మన్‌ గిల్‌ ఆడే విధానం టీ20ల కంటే వన్డే క్రికెట్‌కు బాగా నప్పుతుందని.. పృథ్వీ షా  పొట్టి ఫార్మాట్‌కు సరిగ్గా సరిపోతాడని భారత మాజీ ఓపెనర్‌ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని