Harbhajan : అంతర్జాతీయ క్రికెట్‌కు హర్భజన్‌ సింగ్‌ వీడ్కోలు

భారత టాప్‌ స్పిన్నర్ హర్భజన్‌ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు...

Updated : 24 Dec 2021 17:11 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత టాప్‌ స్పిన్నర్ హర్భజన్‌ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టీమ్‌ఇండియా తరఫున 1998లో అరంగేట్రం చేసిన భజ్జీ.. తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను 2016లో ఆడేశాడు. అప్పటి నుంచి జాతీయ జట్టులో చోటు లభించలేదు. అయితే ఐపీఎల్‌లో సీఎస్‌కే, కోల్‌కతా, ముంబయి జట్ల తరఫున ఆడాడు. రిటైర్‌మెంట్‌ ప్రకటన సందర్భంగా ట్విటర్‌ వేదికగా అభిమానులకు ధన్యవాదాలు చెప్పాడు. ‘‘ ప్రతి మంచి పనికి ముగింపు అనేది ఉంటుంది. ఇవాళ నా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెబుతున్నా. ఇన్నాళ్లు నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. 23 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం అద్భుతంగా, మధుర జ్ఞాపకంగా మారడానికి కృషి చేసిన అందరికీ కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నాడు.

దాదాపు 23 ఏళ్ల కెరీర్‌లో హర్భజన్‌ సింగ్‌ 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అన్ని ఫార్మాట్లు కలిపి 3,500కుపైగా పరుగులు సాధించాడు. అత్యధిక టెస్టు వికెట్లు పడగొట్టిన వారిలో హర్భజన్‌ (417) నాలుగో స్థానంలో ఉన్నాడు. వన్డేల్లో 269 వికెట్లు, టీ20ల్లో 25 వికెట్లు తీశాడు. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని