Hardik Pandya: ఆ లోటు ఇప్పుడు తెలిసొచ్చింది

బ్యాటుతో, బంతితో ఎంతో ఉపయోగపడే హార్దిక్‌ పాండ్య జట్టుకు తెచ్చే విలువే వేరు. బ్యాటింగ్‌లో కష్టాల్లో పడితే ఆదుకుంటాడు.

Updated : 20 Nov 2023 07:07 IST

బ్యాటుతో, బంతితో ఎంతో ఉపయోగపడే హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) జట్టుకు తెచ్చే విలువే వేరు. బ్యాటింగ్‌లో కష్టాల్లో పడితే ఆదుకుంటాడు. బౌలింగ్‌లో పూర్తి కోటా వేయగల సమర్థుడు. ప్రపంచకప్‌ (Icc World Cup)లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ అతను బంతితో రాణించాడు. బంగ్లాదేశ్‌ (Bangladesh) తో మ్యాచ్‌లో అతను గాయపడి టోర్నీకి దూరమైనా భారత్‌ (India) పెద్దగా కంగారు పడలేదు. హార్దిక్‌ లేని లోటును భర్తీ చేసే క్రమంలో శార్దూల్‌ (Shardul Thakur) ను తప్పించి షమి (Shami)ని ఆడించడం గొప్పగా కలిసొచ్చింది. బ్యాటింగ్‌లో సూర్యకుమార్‌ (Surya Kumar Yadav) మీద పెద్దగా ఆధారపడాల్సిన అవసరం లేకపోయింది. దీంతో హార్దిక్‌ లేని లోటు గురించి ఆలోచనే లేదు. కానీ ఫైనల్లో మాత్రం హార్దిక్‌ లేని లోటు స్పష్టంగా కనిపించింది. సూర్యకుమార్‌ ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. హార్దిక్‌ ఉంటే.. జడేజా కంటే ముందే అతను క్రీజులోకి వచ్చి కీలక ఇన్నింగ్స్‌ ఆడేవాడేమో. ఇక బౌలింగ్‌లో హార్దిక్‌ అందుబాటులో ఉంటే.. ఆరో బౌలర్‌గా ఉపయోగపడేవాడు. సిరాజ్‌తో పాటు స్పిన్నర్లు ప్రభావం చూపలేకపోతున్నపుడు కెప్టెన్‌ అతడి వైపు చూసేవాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు