జ్యోతికశ్రీ బృందానికి నిరాశ

పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్‌ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది.

Published : 06 May 2024 02:50 IST

నాసు (బహమాస్‌): పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్‌ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. ఆదివారం మహిళల 4×400 మీటర్లలో జ్యోతికశ్రీ, శుభ వెంకటేశన్‌, విత్య రామ్‌రాజ్‌, పూవమ్మలతో కూడిన జట్టు 3 నిమిషాల 29.74 సెకన్లలో లక్ష్యాన్ని చేరి హీట్‌-1లో అయిదో స్థానంలో నిలిచింది. 4×400 మీటర్ల మిక్స్‌డ్‌ ఈవెంట్లో జ్యోతికశ్రీ, రాజేశ్‌, రూపల్‌, అవినాశ్‌ బృందం 3 నిమిషాల 20.36 సెకన్లలో రేసు పూర్తి చేసి ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. హీట్స్‌లో భారత జట్లు టాప్‌-2లో నిలిస్తే పారిస్‌ బెర్తు దక్కించుకునే అవకాశం ఉండేది. మరోవైపు పురుషుల 4×400 మీటర్ల పరుగులో భారత బృందం (అనాస్‌, రాజేశ్‌, అజ్మల్‌, జాకబ్‌) పోటీల నుంచి వైదొలిగింది. రెండో లెగ్‌లో పరుగెత్తాల్సిన రాజేశ్‌కు కాళ్లు పట్టేయడమే దీనికి కారణం. తొలి లెగ్‌లో అనాస్‌ పరుగు పూర్తి చేయగా.. రెండో లెగ్‌లో రాజేశ్‌ మధ్యలోనే పరుగు ఆపేశాడు. పారిస్‌కు అర్హత సాధించడానికి రెండో అంచె క్వాలిఫికేషన్‌ టోర్నీ రూపంలో భారత్‌కు మరో అవకాశం ఉంది. ఈ పోటీ సోమవారం జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని