అక్టోబరు 6న పాక్‌తో భారత్‌ ఢీ

బంగ్లాదేశ్‌ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ గ్రూప్‌ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌, ఓ క్వాలిఫయర్‌ ఈ గ్రూప్‌లోని ఇతర జట్లు.

Published : 06 May 2024 02:49 IST

మహిళల టీ20 ప్రపంచకప్‌

దుబాయ్‌: బంగ్లాదేశ్‌ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ గ్రూప్‌ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌, ఓ క్వాలిఫయర్‌ ఈ గ్రూప్‌లోని ఇతర జట్లు. అక్టోబరు 3 నుంచి 20 వరకు జరిగే ఈ టోర్నీ షెడ్యూలును ఐసీసీ ప్రకటించింది. భారత్‌ తన గ్రూప్‌ మ్యాచ్‌లన్నింటీని సిల్‌హెట్‌లో ఆడనుంది. అక్టోబరు 4న న్యూజిలాండ్‌తో పోరుతో భారత జట్టు టైటిల్‌ వేటను ఆరంభిస్తుంది. 6న పాకిస్థాన్‌తో తలపడుతుంది. ఆ తర్వాత 9న క్వాలిఫయర్‌-1తో, 13న ఆరుసార్లు ఛాంపియన్‌ ఆస్ట్రేలియాతో ఆడుతుంది. ‘‘టోర్నీలో ప్రతి జట్టూ నాలుగు గ్రూప్‌ మ్యాచ్‌లు ఆడుతుంది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్లో అడుగుపెడతాయి’’ అని ఐసీసీ పేర్కొంది. అక్టోబరు 17, 18వ తేదీల్లో సెమీఫైనల్స్‌, 20న ఫైనల్‌ జరుగుతాయి. బంగ్లాదేశ్‌, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌, క్వాలిఫయర్‌-2 గ్రూప్‌ ‘బి’లో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని