అవే సిరాజ్‌ బలాలు

తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ నిజమైన బలాలని సునీల్‌ గావస్కర్‌ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్‌ సర్వశక్తులూ ఒడ్డుతాడు.

Published : 06 May 2024 02:47 IST

బెంగళూరు: తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ నిజమైన బలాలని సునీల్‌ గావస్కర్‌ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్‌ సర్వశక్తులూ ఒడ్డుతాడు. ఆస్ట్రేలియా పర్యటనలో తన తండ్రి మరణించినా కూడా అతడు జట్టుతోనే కొనసాగాడు. కుటుంబం కోసం స్వదేశానికి రమ్మని చాలామంది కోరినా కూడా దేశానికి ప్రాముఖ్యత ఇచ్చాడు. ఆ సమయానికి అతడేం పెద్ద క్రికెటర్‌ కూడా కాదు. ఆ సిరీస్‌లో గబ్బా టెస్టులో అతడు గొప్పగా బౌలింగ్‌ చేశాడు. కుదురుకున్న స్టీవ్‌ స్మిత్‌ను ఔట్‌ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. తన శక్తిపై తనకి నమ్మకం, వెనుకంజ వేయని తత్వం సిరాజ్‌ నిజమైన బలాలు’’ అని సన్నీ పేర్కొన్నాడు. ఐపీఎల్‌-17లో బెంగళూరు-గుజరాత్‌ టైటాన్స్‌ మ్యాచ్‌లో పవర్‌ప్లేలో సిరాజ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ సహా రెండు వికెట్లు తీసి ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో కీలకపాత్ర పోషించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని