Renuka Singh : కామన్వెల్త్‌లో అదరగొట్టిన రేణుకా సింగ్.. కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్‌

 రేణుకా సింగ్.. కామన్వెల్త్‌ గేమ్స్‌లో తొలిసారి ప్రవేశపెట్టిన మహిళ క్రికెట్‌లో మొదటి మ్యాచ్‌లోనే తన స్వింగ్‌ బౌలింగ్‌తో ...

Published : 09 Aug 2022 20:32 IST

మహిళల క్రికెట్‌లో దూసుకొస్తున్న టీమ్‌ఇండియా బౌలర్‌

(ఫొటో సోర్స్‌: బీసీసీఐ ట్విటర్)

ఇంటర్నెట్ డెస్క్‌: రేణుకా సింగ్.. కామన్వెల్త్‌ గేమ్స్‌లో తొలిసారి ప్రవేశపెట్టిన మహిళ క్రికెట్‌లో మొదటి మ్యాచ్‌లోనే తన స్వింగ్‌ బౌలింగ్‌తో అదరగొట్టేసింది. గ్రూప్‌ స్టేజ్‌లో భారత్‌పై ఆసీస్‌ విజయం సాధించినా. . ఆమె ప్రదర్శన మాత్రం గుర్తుండిపోతుంది. అలానే లీగ్‌ స్థాయిలో మిగిలిన రెండు మ్యాచుల్లోనూ రాణించి మొత్తం 9 వికెట్లు తీసింది. సెమీస్‌లో వికెట్లు తీయలేకపోయిన రేణుకా సింగ్.. ఫైనల్‌లో మాత్రం రెండు వికెట్లు తీసింది. అయితే తుదిపోరులో మరోసారి భారత్‌కు ఆసీస్‌ చేతిలో పరాభవం తప్పలేదు. రజతంతో టీమ్‌ఇండియా సరిపెట్టుకుంది. అయితే కామన్వెల్త్‌లో 11 వికెట్లు తీసి అదరగొట్టిన రేణుకా సింగ్‌ ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో పది స్థానాలను ఎగబాకి 18వ ర్యాంక్‌కు చేరింది. టాప్‌-10లో భారత్‌ నుంచి దీప్తి శర్మ (6) మాత్రమే ఉంది. 

ఇక బ్యాటింగ్‌ విభాగంలో ఆసీస్‌ బ్యాటర్ బెత్ మూనీ (743) అగ్రస్థానం దక్కించుకుంది. కామన్వెల్త్‌ ఐదు మ్యాచుల్లో మూనీ 179 పరుగులు సాధించింది. ఫైనల్‌లో 41 బంతుల్లోనే 61 పరుగులు సాధించి ఆసీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించింది.  ఆ తర్వాత మెగ్ లానింగ్‌ (ఆసీస్‌), సోఫీ డివైన్ (న్యూజిలాండ్), స్మృతీ మంధాన, తహ్లియా మెక్‌గ్రాత్ టాప్‌-5లో నిలిచారు. షఫాలీ వర్మ ఆరో స్థానానికి పడిపోయింది. జెమీమా రోడ్రిగ్స్‌ పదో స్థానం దక్కించుకుంది. ఆల్‌రౌండర్‌ జాబితాలో దీప్తి శర్మ మాత్రమే భారత్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని