IND vs AFG: భారత్‌తో మూడు టీ20ల సిరీస్‌.. అఫ్గాన్‌ కెప్టెన్‌గా ఇబ్రహీం జద్రాన్‌

భారత్‌తో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌ కోసం అఫ్గానిస్థాన్‌ జట్టును ప్రకటించింది.

Updated : 06 Jan 2024 22:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్: భారత్‌, అఫ్గానిస్థాన్‌ మధ్య జనవరి 11 నుంచి మూడు టీ20ల సిరీస్‌ ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌ కోసం 19 మందితో కూడిన జట్టుని అఫ్గానిస్థాన్‌ జాతీయ సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. ఇటీవల వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించుకున్న కెప్టెన్‌ రషీద్‌ఖాన్‌ను కూడా సిరీస్‌కు ఎంపిక చేసింది. అయితే, అతడు మైదానంలోకి దిగడం కష్టమే. దీంతో కెప్టెన్సీ బాధ్యతలను ఇబ్రహీం జద్రాన్‌కు అప్పగించింది. యూఏఈతో జరిగిన టీ20 సిరీస్‌కూ జద్రాన్‌ కెప్టెన్‌గా చేశాడు. 

టీ20 సిరీస్‌ షెడ్యూల్ 

  • జనవరి 11  తొలి టీ20- మొహాలీ రాత్రి 7 గంటలకు
  • జనవరి 14 రెండో టీ20- ఇండోర్‌ రాత్రి 7 గంటలకు
  • జనవరి 17 మూడో టీ20- బెంగళూరు రాత్రి 7 గంటలకు

టీ 20 సిరీస్‌కు అఫ్గాన్‌ జట్టు: ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్‌), రెహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్‌), ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్‌), హజ్రతుల్లా జజాయ్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, కరీం జానాత్, అజమౌల్లా ఒమర్జాయ్‌, షరాఫుద్దీన్ అష్రఫ్, ముజీబుర్‌ రెహ్మాన్, ఫజల్ హక్ ఫారూఖీ, ఫరీద్ అహ్మద్, నవీనుల్‌ హక్, నూర్ అహ్మద్, మహమ్మద్ సలీమ్, కైస్ అహ్మద్, గుల్బాదిన్ నైబ్‌, రషీద్ ఖాన్. 


ఇంగ్లాండ్‌ లయన్స్‌తో వార్మప్‌ మ్యాచ్‌లు.. ఇండియా ‘ఎ’ జట్టు ప్రకటన

భారత్, ఇంగ్లాండ్ మధ్య జనవరి 25 నుంచి ఐదు టెస్టుల సిరీస్‌ ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌కు ముందు ఇంగ్లాండ్ లయన్స్‌, ఇండియా ‘ఎ’ జట్ల మధ్య వార్మప్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. జనవరి 12-13,  జనవరి 17-20 మధ్య ఈ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. ఇందుకోసం భారత సెలక్టర్లు 13 మందితో జట్టును ప్రకటించారు. 

ఇండియా ‘ఎ’ జట్టు: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ప్రదోష్ రంజన్ పాల్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్‌), మానవ్ సుతార్, పుల్కిత్ నారంగ్, నవదీప్ సైనీ, తుషార్ దేశ్‌పాండే, విద్వత్ కావేరప్ప, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్‌), ఆకాష్ దీప్.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని