IND vs ENG: మరోసారి కోహ్లీ విఫలం.. కష్టాల్లో టీమ్‌ ఇండియా

ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో  జరుగుతున్న కీలక టెస్టులో టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో వర్షం కారణంగా అంపెర్లు భోజన విరామం ప్రకటించారు. ఆ సమయానికి

Updated : 01 Jul 2022 19:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న కీలక టెస్టులో విరాట్‌ కోహ్లీ మరోసారి విఫలమయ్యాడు. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో వర్షం కారణంగా అంపెర్లు భోజన విరామం కాస్త ముందుగానే ప్రకటించారు. అప్పటికి భారత్‌ స్కోరు 53/2. తిరిగి వాతావరణ అనుకూలిచండంతో ఆట ప్రారంభం అయ్యింది. 11 పరుగులతో టచ్‌లోకి వచ్చినట్లు కనిపించినా.. యువ పేసర్‌ మాథ్యూ పాట్స్‌ తెలివైన బంతికి కోహ్లీ పెవిలియన్‌కి చేరాడు. ఆఫ్‌సైడ్‌లో పడిన బంతిని.. వికెట్ల మీదకు ఆడుకొని ఔటయ్యాడు. అంతకుముందే హనుమ విహారి (20) ఎల్‌బీడబ్ల్యూగా పాట్స్‌ బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు. కోహ్లీ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయస్‌ (15) దూకుడుగా ఆడే ప్రయత్నంలో కీపర్‌ క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఈ వికెట్‌ ఆండర్సన్‌ ఖతాలో చేరింది. దీంతో 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి టీమ్‌ ఇండియా కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో రిషబ్‌ పంత్‌ (16), రవీంద్ర జడేజా (4) ఉన్నారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు