IND vs NZ: టెస్టు క్రికెట్‌కు అంబాసిడర్ టీమ్‌ఇండియానే: రవిశాస్త్రి
న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకున్న భారత జట్టును మాజీ కోచ్ రవిశాస్త్రి ప్రశంసించాడు. టీమ్‌ఇండియా గత ఐదారు సంవత్సరాలుగా మెరుగ్గా రాణిస్తోందని..
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకున్న భారత జట్టును మాజీ కోచ్ రవిశాస్త్రి ప్రశంసించాడు. టీమ్‌ఇండియా గత ఐదారు సంవత్సరాలుగా మెరుగ్గా రాణిస్తోందని, ప్రస్తుతం టెస్టు క్రికెట్‌కు రాయబారిగా మారిందని పేర్కొన్నాడు. రెండో టెస్టులో భారత్ 372 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించడంతో.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్న విషయం తెలిసిందే.
‘టెస్టు క్రికెట్టుకు ఏ జట్టైనా అంబాసిడర్‌గా మారిందంటే.. అది కచ్చితంగా టీమ్‌ఇండియానే. భారత జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లి సహా చాలా మంది ఆటగాళ్లు టెస్టు క్రికెట్‌ను అమితంగా ఇష్టపడతారు. అందుకే, గత ఐదారు సంవత్సరాలుగా భారత్ టెస్టుల్లో మెరుగైన ప్రదర్శన చేస్తోంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో మేం ఓడిపోయి ఉండొచ్చు. అయినా టెస్టు క్రికెట్లో టీమ్ఇండియా గత కొన్నేళ్లుగా ఆదిపత్యం చెలాయిస్తోందంటే కారణం టెస్టు క్రికెట్ పట్ల ఆటగాళ్లకున్న ఆసక్తే. ప్రస్తుతం టెస్టు క్రికెట్లో యువ ఆటగాళ్లు రాణిస్తున్న తీరు, టెస్టు క్రికెట్ పట్ల వారికున్న అభిమానం చూస్తుంటే.. టీమ్‌ఇండియా వారసత్వాన్ని నిలబెడతారనిపిస్తోంది’ అని రవిశాస్త్రి అన్నాడు.
► Read latest Sports News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Rishi Sunak: రిషి సునాక్ 100 రోజుల ప్రతిన..
-
Crime News
Andhra News: వాగులో దూకి నిందితుడి పరారీ.. పోలీసులు గాలించినా లభించని ఆచూకీ
-
Movies News
K.Viswanath: కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత
-
General News
Telangana News: కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం
-
World News
Saudi Arabia: ఈ యువరాజు హయాంలో.. రికార్డు స్థాయి మరణశిక్షలు..!
-
India News
Jammu Kashmir: కశ్మీర్ ఉగ్రవాదుల కొత్త ఆయుధం.. పెర్ఫ్యూమ్ బాంబ్!