India vs England: దంచికొట్టిన జో రూట్.. భారత బ్యాట్స్‌మెన్‌ జోరు చూపిస్తారా? 

భారత్, ఇంగ్లాండ్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా మా

Updated : 15 Aug 2021 15:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్, ఇంగ్లాండ్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా మారుతోంది. కెప్టెన్‌ జో రూట్‌(180*) భారీ శతకం బాదడంతో ఇంగ్లాండ్‌ తొలిఇన్నింగ్స్‌లో 391 పరుగులు చేసి ఆలౌటైంది.  దీంతో  27 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సంపాదించింది. 119/3 ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్‌ అలవోకగా పరుగులు చేసింది. భారత బౌలర్లకు ఏ మాత్ర అవకాశం ఇవ్వకుండా జో రూట్ బౌండరీలు బాదుతూ స్కోర్‌ బోర్డును ముందుకు కదిలించాడు.  ఈ క్రమంలోనే అతడు 200 బంతుల్లో  సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

వికెట్లు పడుతున్నప్పటికీ జో రూట్‌ మాత్రం దూకుడుగా ఆడాడు. బెయిర్‌ స్టో(57) పరుగులు చేసి ఫర్వాలేదనింపించాడు. బట్లర్‌(23), మొయిన్‌ అలీ(27) పరుగులు చేశారు. మొదటి రెండు సెషన్లలో వికెట్లు తీయడానికి చెమట్చోడిన భారత బౌలర్లు చివరి సెషన్‌లో  పుంజుకుని ఇంగ్లాండ్‌ని కట్టడి చేశారు. మహ్మద్‌ సిరాజ్‌ నాలుగు  వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. ఇషాంత్ శర్మ మూడు, మహ్మద్‌ షమీ రెండు వికెట్లు పడగొట్టారు. బుమ్రాకు వికెట్లేమీ దక్కలేదు. నాలుగో రోజు ఏ జట్టు అధిపత్యం చెలాయిస్తుందో ఆ జట్టుకే విజయావకాశాలు మెండుగా ఉండే అవకాశం ఉంది.

మూడో రోజు ఆట హైలైట్స్‌ మీకోసం..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని