Jasprit Bumrah: ఐసీసీ ర్యాంకుల్లో అగ్రస్థానం.. జస్‌ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత

భారత స్టార్‌ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (Bumrah) టెస్టుల్లో నంబర్‌వన్ బౌలర్‌గా మారాడు. తాజాగా ఐసీసీ ర్యాంకులను ప్రకటించింది.

Updated : 07 Feb 2024 18:28 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్‌తో (IND vs ENG) జరిగిన రెండు టెస్టుల్లో అదరగొట్టిన భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మరో అరుదైన ఘనతను సాధించాడు. ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఏకంగా తొమ్మిది వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను ఓడించడంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో మూడు స్థానాలకు ఎగబాకిన బుమ్రా నంబర్‌ వన్‌ ర్యాంక్‌కు చేరాడు. టెస్టు ర్యాంకుల్లో ఓ భారత పేసర్‌ అగ్రస్థానంలో నిలవడం ఇదే తొలిసారి కావడం విశేషం.

బుమ్రా 881 పాయింట్లు సాధించగా.. కగిసో రబాడ (851) రెండో స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న అశ్విన్‌ (841) రెండు ర్యాంకులు కిందకు పడిపోయాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో ఒక మ్యాచ్‌ మాత్రమే ఆడిన   రవీంద్ర జడేజా (746) రెండు స్థానాలు దిగజారి 9వ స్థానానికి పరిమితమయ్యాడు. ఆసీస్‌ కెప్టెన్‌ ప్యాట్ కమిన్స్ (828), జోష్ హేజిల్ వుడ్ (818) నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు.

బ్యాటింగ్ విభాగంలో న్యూజిలాండ్‌ స్టార్ కేన్ విలియమ్సన్ (864) అగ్రస్థానంలో ఉన్నాడు. భారత్‌ నుంచి విరాట్ కోహ్లీ (760) మాత్రమే టాప్‌-10లో నిలిచాడు. విరాట్ 7వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో తొలి రెండు స్థానాలు భారత ఆటగాళ్లవే. రవీంద్ర జడేజా (416), రవిచంద్రన్ అశ్విన్ (326) ముందు వరుసలో ఉన్నారు. అక్షర్ పటేల్ (286) ఐదో స్థానంలోకి దూసుకొచ్చాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు