KL Rahul: కెప్టెన్సీ అంటే ఇష్టం.. ఇది నాకేం కొత్త కాదు: కేఎల్ రాహుల్

కెప్టెన్సీ తనకు కొత్త కాదని, ఇప్పటికే కెప్టెన్‌గా చాలా మ్యాచ్‌ల్లో జట్టుకు విజయాలనందించానని టీమ్‌ఇండియా తాత్కాలిక సారథి కేఎల్ రాహుల్ (KL Rahul) పేర్కొన్నాడు. 

Published : 23 Sep 2023 10:46 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన మొదటి వన్డేలో టీమ్‌ఇండియా (Team India) 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. రోహిత్‌ గైర్హాజరీతో కేఎల్ రాహుల్ (KL Rahul) జట్టును విజయ పథంలో నడిపిండమే కాకుండా అర్ధ శతకం (58) బాది బ్యాటర్‌గానూ అదరగొట్టాడు. మ్యాచ్‌ అనంతరం రాహుల్ మాట్లాడాడు. కెప్టెన్సీ తనకు కొత్త కాదని, ఇప్పటికే కెప్టెన్‌గా చాలా మ్యాచ్‌ల్లో జట్టుకు విజయాలనందించానని పేర్కొన్నాడు.

‘‘కెప్టెన్‌గా వ్యవహరించడం ఇది నాకు మొదటిసారేం కాదు. ఇప్పటికే సారథిగా చాలా మ్యాచ్‌ల్లో జట్టును గెలిపించాను. కెప్టెన్సీ అంటే నాకు ఇష్టం. సారథిగా జట్టును ఎలా నడిపించాలో అలవాటు పడ్డాను. కొలంబోలో ఆడి వచ్చిన అనుభవంతో ఈ మ్యాచ్‌ ప్రారంభంలో మైదాన పరిస్థితులు స్వర్గాన్ని తలపించాయి. కానీ, మధ్యాహ్నాం తర్వాత ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆడటం చాలా కష్టం. ఫిజికల్‌గా కూడా సవాలుగా ఉంటుంది. కానీ, మేమందరం పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాం. మైదానంలో దాన్ని ప్రదర్శించాం. మేం ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగాం. దీంతో ప్రతీ బౌలర్‌ 10 ఓవర్ల కోటా పూర్తి చేయాల్సి వచ్చింది. క్రీజులో కుదురుకున్న గిల్ ఔటైన తర్వాత ఇన్నింగ్స్‌ గాడి తప్పినట్లు అనిపించింది. కానీ, సూర్యకుమార్‌తో మంచి భాగస్వామ్యాన్ని నిర్మించగలిగాను. స్ట్రెక్‌రొటేట్ చేయడం, ఎలాంటి షాట్లు ఆడాలనే దాని గురించి సూర్య, నేను మాట్లాడుకున్నాం. తొందరపడకుండా ఆచితూచి ఆడుకుంటూ మ్యాచ్‌ ఆఖరి వరకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాం’’ అని కేఎల్ రాహుల్ పేర్కొన్నాడు. ఆదివారం జరిగే రెండో వన్డేకు కూడా కేఎల్ రాహుల్ నాయకత్వం వహించనున్నాడు. సెప్టెంబరు 27న జరిగే మూడో వన్డేకు రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్ శర్మ అందుబాటులోకి రానున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు