PAK vs AFG: అఫ్గానిస్థాన్‌తో కీలక మ్యాచ్‌.. మూడు వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్‌

వరుసగా రెండు మ్యాచ్‌ల్లో పరాజయంపాలైన పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌తో కీలక మ్యాచ్‌లో తలపడుతోంది.  ఈ మ్యాచ్‌లో పాక్‌ ఓడితే ఆ జట్టు సెమీస్ అవకాశాలు బాగా దెబ్బతింటాయి. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్థాన్‌.. అఫ్గాన్‌కు భారీ లక్ష్యం నిర్దేశించడంలో తడబడుతోంది.

Published : 23 Oct 2023 16:11 IST

చెన్నై: వరుసగా రెండు మ్యాచ్‌ల్లో పరాజయంపాలైన పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌తో కీలక మ్యాచ్‌లో తలపడుతోంది.  ఈ మ్యాచ్‌లో పాక్‌ ఓడితే ఆ జట్టు సెమీస్ అవకాశాలు బాగా దెబ్బతింటాయి. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్థాన్‌.. అఫ్గాన్‌కు భారీ లక్ష్యం నిర్దేశించడంలో తడబడుతోంది. 30 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్‌ (58; 75 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకం బాదగా.. మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (17) తక్కువ స్కోరుకే పెవిలియన్ బాటపట్టాడు. తొలి వికెట్‌కు ఓపెనర్లు 56 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇమామ్‌ను నవీనుల్‌ హక్‌ పెవిలియన్‌కు పంపగా.. షఫీక్‌, మహ్మద్ రిజ్వాన్ (8)లను నూర్ అహ్మద్ తన వరస ఓవర్లలో పెవిలియన్‌కు పంపాడు. మరోవైపు, కెప్టెన్ బాబర్ అజామ్‌ (41*; 52 బంతుల్లో 3 ఫోర్లు) నిలకడగా ఆడుతుండగా.. సాద్ షకీల్ (9*) పరుగులతో ఉన్నాడు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని