IPL 2023: గంభీర్‌తో నవీనుల్‌ హక్‌.. వైరల్‌గా ఇన్‌స్టా పోస్టు.. ‘కింగ్‌’ను ఉద్దేశించేనా...?

వారం రోజులు గడిచినా లఖ్‌నవూ ఆటగాడు నవీనుల్‌ హక్‌, బెంగళూరు స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మధ్య ట్విటర్‌ వార్‌ మాత్రం ఆగడం లేదు. తాజాగా నవీనుల్‌ హక్‌ చేసిన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టు వైరల్‌గా మారింది.

Published : 07 May 2023 11:30 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌లో (IPL 2023) విరాట్ కోహ్లీ - గౌతమ్ గంభీర్ - నవీనుల్‌ హక్‌ వివాదం గుర్తుంది కదా.. ఆ సంఘటన జరిగి దాదాపు వారం రోజులైంది. మైదానంలోనూ, సోషల్‌ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత చెన్నైతో లఖ్‌నవూ ఆడింది. అయితే వర్షం కారణంగా మధ్యలోనే మ్యాచ్‌ రద్దైంది. దిల్లీతో బెంగళూరు తలపడింది. కానీ, డీసీ చేతిలో ఆర్‌సీబీ ఓడిపోయింది. దీంతో లఖ్‌నవూ మెంటార్‌ గౌతమ్‌ గంభీర్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ పేసర్ నవీనుల్‌ హక్ పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. దిల్లీ చేతిలో బెంగళూరు ఓడిపోవడంతో స్టార్‌ బ్యాటర్ విరాట్‌ కోహ్లీని ఉద్దేశించే నవీనుల్‌ ఇలాంటి పోస్టు పెట్టాడని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ఇంతకీ నవీనుల్‌ హక్‌ ఏమని పోస్టు పెట్టాడంటే...?

‘‘మీతో ఇతరులు ఎలా ప్రవర్తించాలని అనుకుంటారో మీరూ అలానే ఉండాలి. మీతో ప్రజలు ఎలా మాట్లాడాలని అనుకుంటారో మీరూ అలానే మాట్లాడాలి’’ అని నవీనుల్‌ హక్‌ పోస్టు చేశాడు. 

నవీనుల్‌ హక్‌ పోస్టుపై గౌతమ్‌ గంభీర్‌ స్పందించాడు. ‘‘నువ్వు నీలానే ఉండు.. ఎప్పటికీ మారొద్దు’’ అని రిప్లయ్ ఇచ్చాడు. దీంతో అభిమానులు కామెంట్ల వర్షం కురిపించారు. ‘‘మెంటార్‌ అంటే ఇలాగే ఉండాలి’’.. ‘‘ఆత్మాభిమానంతో ఉండాలి.. గర్వంగా ఉంది’’.. అని కొందరు కామెంట్‌ చేశారు. నిన్న రాత్రి పెట్టిన పోస్టుకు 54వేలకుపైగా లైకులు వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు