Nirmala Sitharaman: నిర్మలమ్మ బడ్జెట్‌ ప్రసంగంలో ప్రజ్ఞానంద ప్రస్తావన

క్రీడల్లో భారత యువత మెరుగైన ఫలితాలు సాధిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. 

Published : 01 Feb 2024 17:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యువత క్రీడల్లో నూతన అధ్యాయాలను సృష్టిస్తున్నందుకు దేశం గర్విస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (nirmala sitaraman)అన్నారు. 2023లో ప్రస్తుత ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌ కార్ల్‌సన్‌ (carlsen)కు భారత నెం1 ఆటగాడు ప్రజ్ఞానంద (praggnananda)గట్టి పోటినిచ్చాడని కొనియాడారు. మధ్యంతర బడ్జెట్‌ (budget 2024)ను ప్రవేశపెడుతూ ఆర్థిక మంత్రి క్రీడా రంగంపై పలు విషయాలు మాట్లాడారు. 

‘‘మన యువత క్రీడల్లో నూతన రికార్డులు నెలకొల్పుతున్నందుకు దేశం గర్విస్తోంది. 2023లో జరిగిన ఆసియా, ఆసియా పారా గేమ్స్‌లో మన ఆటగాళ్లు అత్యధిక పతకాలు సాధించారు. ఇది ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. ప్రపంచ చెస్‌ ఛాంపియన్ షిప్‌ ఫైనల్‌లో ప్రజ్ఞానంద.. మాగ్నస్‌ కార్ల్‌సన్‌కు గట్టిపోటీ ఇచ్చాడు. 2010లో దేశంలో చెస్‌ గ్రాండ్‌ మాస్టర్లు 20 మంది ఉండగా 2023లో ఆ సంఖ్య 80కు చేరింది’’ అని కేంద్ర ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.

2024 టాటా స్టీల్‌ చెస్‌ టోర్నమెంట్‌లో చైనా ఆటగాడు లిరెన్‌ను ఓడించిన ప్రజ్ఞానంద, విశ్వనాథన్‌ ఆనంద్‌ను అధిగమించి భారత నెం1 ర్యాంకు ఆటగాడిగా అవతరించాడు. 12 సంవత్సరాలకే గ్రాండ్ మాస్టరైన అతడు ప్రపంచంలో రెండో అతి పిన్న వయస్కుడైన గ్రాండ్‌ మాస్టర్‌గా రికార్డు నెలకొల్పాడు. భారత క్రీడాకారులు 2023 ఆసియా గేమ్స్‌లో 107 పతకాలు, ఆసియా పారా గేమ్స్‌లో 111 పతకాలను సాధించి సత్తా చాటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు