IND vs AUS: ఆసీస్‌తో రెండో వన్డే.. శ్రేయస్ అయ్యర్‌కు ఇదేనా చివరి ఛాన్స్..?
ఇందౌర్ వేదికగా ఆదివారం భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య (IND vs AUS) రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక్కడే సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో భారత్ బరిలోకి దిగనుంది.
కీలక ఆటగాళ్లు లేకపోయినా సమష్టిగా రాణించి.. బలమైన ఆసీస్‌ను ఓడించారు. తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ చివరి వరకూ క్రీజ్‌లో ఉండి గెలిపించాడు. ఈ క్రమంలోనే వన్డేల్లోనూ భారత్ నంబర్‌వన్ ర్యాంక్‌కు చేరింది. 50 ఓవర్ల క్రికెట్‌లో ఇబ్బందిపడిన సూర్య మళ్లీ ఫామ్ అందుకొన్నట్లే కనిపించాడు. బ్యాటింగ్‌లో ఒకరు.. బౌలింగ్‌లో ఒకరు మినహా మిగతావారు రాణించారు. వరల్డ్ కప్ ముంగిట ఆ ఇద్దరి విషయంలోనే మేనేజ్‌మెంట్‌తోపాటు అభిమానుల్లో సందిగ్ధత నెలకొంది. ఇంతకీ ఆ ఇద్దరు ఆటగాళ్లు ఎవరంటే..?
శ్రేయస్‌కు కీలకం..
నలుగురు భారత బ్యాటర్లు అర్ధశతకాలు అలరించారు. ఆసీస్ పేస్‌ను ఎదుర్కొని ఓపెనర్లుగా వచ్చిన శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ కూడా హాఫ్ సెంచరీలు సాధించారు. ఇక రెండో వన్డేలోనూ వీరిద్దరే ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారు. ఈ మ్యాచ్‌కూ రోహిత్, విరాట్ అందుబాటులో ఉండరు. అయితే, మొదటి వన్డేలో వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ ఘోరంగా విఫలమయ్యాడు. బ్యాటింగ్‌లో ఓపెనర్లు శుభారంభమిచ్చినా.. శ్రేయస్ మాత్రం స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయలేకపోయాడు. అటు ఫీల్డింగ్‌లోనూ చురుగ్గా ఉండలేకపోయాడు. క్యాచ్‌లను కూడా విడిచిపెట్టాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడా..? లేదా..? అనే అనుమానం కలగకమానదు. అందుకే, రెండో వన్డే అతడికి చాలా కీలకం. ఈసారి ఆడకపోతే మాత్రం మూడో వన్డేతోపాటు వరల్డ్ కప్‌లో స్థానం గల్లంతు కావడం ఖాయం. నాలుగోస్థానంలో వచ్చిన కెప్టెన్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆ తర్వాత సూర్యకుమార్ కూడా ఫిఫ్టీతో ఫామ్‌లోకి వచ్చేశాడు. ఇప్పుడు బంతి శ్రేయస్ కోర్టులోనే ఉంది. ఈ మ్యాచ్‌లో సరిగా ఆడకపోతే మాత్రం.. మూడో వన్డే నాటికి విరాట్ కోహ్లీ వచ్చేస్తాడు. అప్పుడు శ్రేయస్‌పైనే వేటు పడే అవకాశాలు మెండుగా ఉంటాయి.
ఈ పేస్ ఆల్‌రౌండర్ పరిస్థితేంటో?
మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాపై షమీ, బుమ్రా, అశ్విన్, జడేజా రాణించారు. షమీ ఏకంగా ఐదు వికెట్లు తీసి సంచలన బౌలింగ్ చేశాడు. అయితే, ఒకే ఒక్క బౌలర్ మాత్రం భారీగా పరుగులు సమర్పించాడు. అతడే శార్దూల్ ఠాకూర్. ఆసీస్‌పై తొలి వన్డేలో వికెట్ తీయకుండా 78 పరుగులు సమర్పించాడు. హార్దిక్ పాండ్యతోపాటు పేస్ ఆల్‌రౌండర్‌గా అక్కరకొస్తాడని భావించినా.. ‘లార్డ్’ శార్దూల్ మాత్రం తనస్థాయి ఆటను ప్రదర్శించలేకపోతున్నాడు. రెండోవన్డేలోనూ ఇదే ప్రదర్శన పునరావృతమైతే మాత్రం వరల్డ్ కప్ ఛాన్స్ చేజారే ప్రమాదం లేకపోలేదు. మూడో వన్డేలో హార్దిక్ రంగంలోకి దిగుతాడు. దీంతో శార్దూల్‌కు తుది జట్టులో స్థానం కష్టమే. వరల్డ్ కప్‌లో ఆడే పూర్తిస్థాయి జట్టు ఎలా ఉంటుందో.. మూడో వన్డేలో బరిలోకి దిగే టీమ్ కూడా దాదాపు అలాగే ఉండొచ్చని ఇప్పటికే ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ సిరీస్‌కు ముందు వెల్లడించిన సంగతి తెలిసిందే.
అశ్విన్ ఈసారి కూడా..
దాదాపు ఏడాదిన్నర తర్వాత వన్డే జట్టులోకి వచ్చినా సరే.. తనకేమీ కొత్త ఫార్మాట్ కాదన్నట్లుగా అశ్విన్ బౌలింగ్ ఉంది. పది ఓవర్ల కోటాను అలవోకగా పూర్తి చేసేశాడు. అందుకు కారణం కూడా టెస్టుల్లో రోజుల తరబడి బౌలింగ్ చేసిన అనుభవం అశ్విన్ సొంతం. తన పది ఓవర్ల కోటాలో 47 పరుగులు మాత్రమే ఇచ్చిన అశ్విన్ కీలకమైన లబుషేన్ వికెట్‌ను తీశాడు. దీంతో అక్షర్ పటేల్ లేని లోటును తీర్చేసినట్లే. ఆసీస్‌తో చివరి వన్డే నాటికి అక్షర్ పటేల్ కోలుకుని వచ్చి జట్టుతోపాటు చేరితేనే ప్రపంచకప్ స్క్వాడ్‌లో కొనసాగుతాడు. ఒకవేళ గాయం నుంచి కోలుకోకపోతే మాత్రం అక్షర్ స్థానంలో అశ్విన్‌కు మేనేజ్‌మెంట్ చోటు కల్పించనుంది. అందుకే, ఆసీస్‌తో రెండో వన్డేలోనూ అశ్విన్ రాణిస్తే మరో ఆప్షన్ వైపు చూసే అవకాశం ఉండదు. ఎందుకంటే యువ స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా రేసులో ఉన్నాడు. కానీ, ఆసియా కప్ ఫైనల్‌తోపాటు ఆసీస్‌తో సిరీస్‌కు ఎంపికైనా ఒక్క మ్యాచ్‌లో ఆడే అవకాశం రాలేదు.
మ్యాచ్ షెడ్యూల్.. పిచ్ రిపోర్ట్
ఇందౌర్ వేదికగా ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్‌ను అరగంట ముందు వేస్తారు. జియో సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌తోపాటు స్పోర్ట్స్ 18 ఛానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించొచ్చు. వర్షం పడే అవకాశాలు చాలా తక్కువే. అయినా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. సాధారణంగా ఇందౌర్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. బౌండరీ లైన్లు కూడా చిన్నవే. దీంతో స్పిన్నర్లకు కఠిన పరీక్ష ఎదురుకానుంది. టాస్ గెలిచే జట్టు ఛేదనకే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువని క్రికెట్ విశ్లేషకుల అంచనా.
తుది జట్టు (అంచనా): శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్/సిరాజ్, అశ్విన్, షమీ, బుమ్రా
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Rahul Dravid: ఇన్నింగ్స్ ఇంకా ఉంది
సందిగ్ధత తొలగింది. ఊహాగానాలకు తెరపడింది. టీమ్ఇండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ కొనసాగనున్నాడు. అతడి కాంట్రాక్ట్‌ను పొడిగించాలని బీసీసీఐ నిర్ణయించింది. వీవీఎస్ లక్ష్మణ్ ఎన్సీఏలోనే ఉంటాడు. -
Dravid: మెప్పించాడు ఇలా...
జూనియర్ కోచ్‌గా, ఎన్సీఏ అధిపతిగా తనదైన ముద్ర వేసినా, మంచి పేరు తెచ్చుకున్నా ద్రవిడ్ ఏనాడు టీమ్ఇండియా కోచ్ పదవిపై ఆసక్తిని ప్రదర్శించలేదు. బీసీసీఐ పెద్దలు ప్రయత్నించినా ఎందుకో అతడు విముఖత వ్యక్తం చేశాడు. కానీ ద్రవిడ్ ఒకప్పటి సహచరుడైన గంగూలీ (అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు).. రవిశాస్త్రి అనంతరం కోచ్‌గా ఉండేలా ద్రవిడ్‌ను ఒప్పించగలిగాడు. -
Rohit Sharma: మరి రోహిత్?
దక్షిణాఫ్రికా పర్యటన కోసం సెలక్షన్ కమిటీ గురువారం భారత జట్లను ప్రకటించనుంది. టీ20ల్లో తిరిగి భారత్‌కు నాయకత్వం వహించాలని రోహిత్ శర్మను బీసీసీఐ పెద్దలు ఒప్పించడానికి ప్రయత్నించే అవకాశముంది. 2022 ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్ ఓడినప్పటి నుంచి రోహిత్ పొట్టి క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. -
IND vs AUS: ఇలాంటి పరిస్థితుల్లో ఎంతైనా ఛేదించొచ్చు
ఆస్ట్రేలియాతో మూడో టీ20లో భారత పేసర్ల వైఫల్యానికి విపరీతమైన మంచు కారణమని ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఓవర్‌కు 14 పరుగుల లక్ష్య ఛేదన కూడా సాధ్యమేనని తెలిపాడు. 222 స్కోరును కాపాడుకోలేకపోయిన భారత్.. చివరి 5 ఓవర్లలో 80 పరుగులు సమర్పించుకుంది. -
ఆ అనుభవం ఉపయోగపడుతుంది
గొప్ప సారథుల ఆధ్వర్యంలో ఆడిన అనుభవం తనకెంతో ఉపయోగపడుతుందని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అన్నాడు. విరాట్ కోహ్లి, రోహిత్‌శర్మ సారథ్యంలో ఆడిన గిల్.. ఐపీఎల్లో తొలిసారిగా నాయకత్వం వహించనున్నాడు. -
వచ్చే ఏడాది శ్రీలంకకు టీమ్ఇండియా
సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ)కు శుభవార్త. వచ్చే ఏడాది జులై- ఆగస్టులో శ్రీలంకలో భారత జట్టు పర్యటించనుంది. ఈ పర్యటనలో మూడేసి వన్డేలు.. టీ20ల్లో భారత్, శ్రీలంక తలపడతాయని 2024 వార్షిక క్యాలెండర్లో ఎస్ఎల్సీ పేర్కొంది. వచ్చే ఏడాది శ్రీలంక 52 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనుంది. -
Bumrah: బుమ్రా పోస్టు వెనుక బాధకు కారణమదేనేమో: క్రిష్ శ్రీకాంత్
ముంబయి ఇండియన్స్ (MI) జట్టులో ఏం జరుగుతుందనేది అభిమానుల్లో ఉత్కంఠగా మారింది. బుమ్రా పెట్టిన పోస్టుపై జట్టునే ఒక కుటుంబంగా భావించే మేనేజ్‌మెంట్ ఎలా స్పందిస్తుందో అందరిలోనూ మెదిలే ప్రశ్న. -
విలియమ్సన్ సెంచరీ
బంగ్లాదేశ్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు నువ్వానేనా అన్నట్టుగా సాగుతోంది. ఆతిథ్య బంగ్లాదేశ్‌ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసిన కివీస్‌కు.. బ్యాటుతో ఇబ్బందులు తప్పలేదు. ఎడమచేతి వాటం స్పిన్నర్ తైజుల్ ఇస్లాం (4/89) సత్తా చాటడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 8 వికెట్లకు 266 పరుగులు సాధించింది.


తాజా వార్తలు (Latest News)
-
AP HighCourt: ఎస్సై నియామక ప్రక్రియపై హైకోర్టులో విచారణ
-
బందీలు విడుదలవుతున్న వేళ.. హమాస్ చెరలో 10 నెలల చిన్నారి మృతి..!
-
పన్నూ హత్య కుట్ర కేసు.. భారత వ్యక్తిపై అమెరికా అభియోగాలు
-
EastCoast Train: ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.. భయంతో ప్రయాణికుల పరుగులు
-
Tata Tech Listing: టాటా టెక్ బంపర్ లిస్టింగ్.. ఒక్కో లాట్‌పై రూ.21 వేల లాభం
-
Elon Musk: ‘పోతే పోండి.. బెదిరించొద్దు’.. అడ్వర్టైజర్లపై మస్క్ ఆగ్రహం!