Rafael Nadal : ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత నాదల్.. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ల వీరుడిగా రికార్డు
స్పెయిన్ బుల్ నాదల్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రఫ్పాడించి సరికొత్త చరిత్రను...
మెల్బోర్న్: స్పెయిన్ బుల్ నాదల్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రఫ్పాడించి సరికొత్త చరిత్రను లిఖించాడు. జకోవిచ్, రోజర్ ఫెదరర్‌లను దాటుకుని టెన్నిస్ ప్రపంచంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లను కైవసం చేసుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ప్రస్తుత ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌తో నాదల్ గ్రాండ్‌స్లామ్‌ల సంఖ్య 21కి చేరింది. 2009 తర్వాత మళ్లీ ఇప్పుడే రఫెల్ నాదల్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను సొంతం చేసుకోవడం విశేషం. సీనియర్ ప్లేయర్ అయిన నాదల్ ముందు మెద్వెదెవ్ నిలవలేకపోయాడు.
ఆఖరి సెట్‌వరకూ హోరాహోరీగా సాగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో మెద్వెదెవ్పై 2-6, 6-7, 6-4, 6-4, 7-5 తేడాతో రఫెల్ నాదల్ విజయం సాధించాడు. దీంతో తన కెరీర్లో రెండో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా 21వ గ్రాండ్‌స్లామ్ గెలుచుకోవడం విశేషం. తొలి రెండు సెట్లను కోల్పోయిన నాదల్.. ఆఖరి మూడు సెట్లలో అసమాన పోరాటం కనబరిచి విజయం సాధించడంతోపాటు టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.
తొలి సెట్‌ను మెద్వెదెవ్ దూకుడుగా ఆడి 6-2 తేడాతో గెలుచుకున్నాడు. రెండో సెట్లో నాదల్ తీవ్రంగా పోరాడినా 6-7తో మెద్వెదెవ్ విజయం సాధించాడు. వరుసగా రెండు సెట్లను కోల్పోయిన నాదల్ ఎక్కడా తగ్గలేదు. తన అనుభవాన్ని మొత్తం ఉపయోగించి చివరి మూడు సెట్లలో (6-4, 6-4, 7-5) విజయం సాధించి రికార్డు నమోదు చేశాడు. ఇద్దరూ చెరో రెండు సెట్లను గెలవడంతో మ్యాచ్ ఐదో సెట్‌కు వెళ్లింది. అయితే అక్కడా మెద్వెదెవ్ పట్టువిడవకపోవడంతో నాదల్ కాస్త శ్రమ పడాల్సి వచ్చింది. ఓ వైపు నొప్పి వెంటాడుతున్నా ఏమాత్రం లెక్క చేయక దాదాపు ఐదున్నర గంటలపాటు పోరాడటం విశేషం. ఇప్పటి వరకు ఐదు సార్లు వీరిద్దరూ తలపడగా.. ఒక్కసారి మాత్రమే మెద్వెదెవ్ గెలిచాడు. మిగతా నాలుగుసార్లు నాదల్ విజయం సాధించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్‌రేట్‌పై గావస్కర్
హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్‌లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్‌గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్‌లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో సన్‌రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్‌రౌండర్ గుల్బాదిన్ నయీబ్‌తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్‌రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్‌లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్‌లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఎయిర్ గెశ్చర్స్‌తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు