Rashid Khan: ఆ ఒక్కడికి బౌలింగ్‌ చేయడం చాలా కష్టం: రషీద్‌ఖాన్‌

ప్రస్తుత తరం నాణ్యమైన స్పిన్నర్లలో రషీద్‌ఖాన్‌ ఒకడు. అతడి బౌలింగ్‌లో పరుగులు రాబట్టడానికి బిగ్‌ హిట్టర్లు కూడా నానాతంటాలు పడుతుంటారు. అందుకే టీ20 క్రికెట్‌తోపాటు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో రషీద్‌ఖాన్‌ తన

Published : 02 Jun 2022 01:46 IST

ఇంటర్నెట్ డెస్క్: యువతరం నాణ్యమైన స్పిన్నర్లలో రషీద్‌ఖాన్‌ ఒకడు. అతడి బౌలింగ్‌లో పరుగులు రాబట్టడానికి బిగ్‌ హిట్టర్లు కూడా తంటాలు పడుతుంటారు. అందుకే, టీ20 క్రికెట్‌తోపాటు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో రషీద్‌ఖాన్‌ తన స్పిన్‌ మాయాజాలంతో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. ఇటీవల ముగిసిన టీ20 లీగ్‌లో గుజరాత్‌ తరఫున ఆడిన ఈ అఫ్గాన్‌ బౌలర్‌ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 16 మ్యాచ్‌ల్లో 6.59 ఎకానమీతో 19 వికెట్లు పడగొట్టి గుజరాత్‌ కప్పు కొట్టడంలో కీలకపాత్ర పోషించాడు. ఇంత మంచి రికార్డు ఉన్న రషీద్‌ఖాన్‌ ఓ బ్యాటర్‌కి బౌలింగ్‌ చేసేందుకు భయపడుతున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా బయటపెట్టాడు. ఆ ఆటగాడు ఎవరో కాదు గుజరాత్ జట్టు ఓపెనర్‌ శుభమన్‌ గిల్‌. అతడికి బౌలింగ్‌ చేయడం కష్టమని రషీద్‌ పేర్కొన్నాడు.

‘శుభమన్‌ గిల్‌తో ఇక్కడ ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది. అతడు చాలా కష్టపడే వ్యక్తి. జట్టులో ఆటగాళ్లలో ఉత్సాహం నింపుతాడు. అతడి వద్ద ఉన్నందుకు సంతోషంగా ఉంది. టోర్నమెంట్‌లో శుభమన్‌ గిల్ ఆడిన తీరు నమ్మశక్యంగా లేదు. మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు అతడికి బౌలింగ్‌ చేయడం కష్టం. కానీ, అదృష్టవశాత్తు ఇద్దరం ఒకే జట్టులో ఉన్నాం’ అని రషీద్‌ఖాన్‌ వివరించాడు. టీ20 లీగ్‌లో గిల్‌ 16 మ్యాచ్‌ల్లో 34.50 సగటుతో 365పరుగులు చేశాడు. ఫైనల్‌లో సిక్సర్‌ కొట్టి గుజరాత్‌కు విజయాన్ని అందించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని