Delhi Capitals: ఇంగ్లాండ్‌ కౌంటీ జట్టుపై దిల్లీ క్యాపిటల్స్‌ కన్ను!

దిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ మేనేజ్‌మెంట్ జీఎంఆర్‌ గ్రూప్‌ (GMR Group) మరో జట్టులో వాటాలను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతోంది. 

Updated : 11 Jan 2024 18:50 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్ లీగ్ (IPL) ఫ్రాంచైజీ దిల్లీ క్యాపిటల్స్‌ ప్రపంచవ్యాప్తంగా తమ బ్రాండ్‌ను విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే దుబాయ్, దక్షిణాఫ్రికా టీ20 లీగుల్లో జట్లను సొంతం చేసుకున్న డీసీ సహ యజమాన్యం జీఎంఆర్‌ గ్రూప్ ఇప్పుడు ఇంగ్లాండ్‌లోని కౌంటీలపై ఆసక్తి ప్రదర్శిస్తోంది. అందుకోసం ‘ముందస్తు చర్చలు’ నిర్వహిస్తోన్నట్లు కథనాలు వస్తున్నాయి. హాంప్‌షైర్ జట్టులో షేర్లను కొనుగోలు చేసే ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. 

‘‘కౌంటీ క్రికెట్ క్లబ్‌లో మెజారిటీ వాటాదారు రాడ్ బ్రాన్స్‌గ్రోవ్‌. ఈ జట్టుకు మాజీ ఛైర్మన్ అయిన రాడ్‌ నుంచి స్టాక్‌ను కొనుగోలు చేసేందుకు ఇప్పటికే ముందస్తు చర్చలు జరిగాయి. హాంప్‌షైర్‌లో భాగస్వామ్యమయ్యేందుకు జీఎంఆర్‌ గ్రూప్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది’’ అని  క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. ఒక వేళ ఈ డీల్‌ కుదిరితే విదేశీ ఫ్రాంఛైజీ యాజమాన్యం కిందకు వెళ్లిన తొలి ఇంగ్లాండ్ కౌంటీ జట్టుగా హాంప్‌షైర్‌ నిలుస్తుంది. 

ఇంగ్లాండ్‌లో హండ్రెడ్‌ టోర్నమెంట్‌కు విపరీతమైన ఆదరణ ఉంది. ఇప్పుడు కౌంటీల్లోకి అడుగు పెట్టడం వల్ల ఐపీఎల్‌లో సొంతంగా ప్లేయర్లను తయారు చేసుకొనేందుకు అవకాశం కలుగుతుంది. ఇటీవలే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కౌంటీ జట్లకు స్టాక్‌ను (50 శాతం వరకు) విక్రయించుకునేందుకు అవకాశం కల్పించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు