Rohit Sharma: గాయంపై స్పందించిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ
బంగ్లాదేశ్‌పై రెండో వన్డే మ్యాచ్‌లో భారత్ పోరాడి ఓడింది. 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్‌ఇండియా.. రోహిత్ శర్మ (51*), శ్రేయస్ అయ్యర్ (82), అక్షర్ పటేల్ (56) అర్ధశతకాలతో పోరాడారు.
ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్‌పై రెండో వన్డే మ్యాచ్‌లో భారత్ పోరాడి ఓడింది. 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్‌ఇండియా.. రోహిత్ శర్మ (51*), శ్రేయస్ అయ్యర్ (82), అక్షర్ పటేల్ (56) అర్ధ శతకాలతో పోరాడింది. చివరికి 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను బంగ్లాదేశ్ 2-0 తేడాతో కైవసం చేసుకొంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును మెహిదీ హసన్ దక్కించుకొన్నాడు. మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు.
గాయంపై రోహిత్
‘‘ఫీల్డింగ్ చేస్తున్న క్రమంలో వేలికి గాయమైంది. అయితే మరీ తీవ్రమైందేమీ కాదు. కానీ డిస్‌లోకేషన్ (స్థానభ్రంశం) అయి ఉండొచ్చు. అదృష్టవశాత్తూ ఫ్రాక్చర్ కాలేదు. అందుకే బ్యాటింగ్ చేయగలిగా. మ్యాచ్ అనగానే అందులో పాజిటివ్, నెగిటివ్ ఉండటం సహజం. అయితే బంగ్లాదేశ్ 69/6 నుంచి 270కిపైగా పరుగులు చేయడమంటే మా బౌలర్లు ప్రభావం చూపలేదు. ఆరంభం బాగున్నా... దానినే కొనసాగించలేకపోయాం. దీనిపై కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది. మెహిదీ, మహముదుల్లా బ్యాటింగ్ బాగుంది. ఇద్దరి భాగస్వామ్యం బంగ్లాను ముందుకు తీసుకెళ్లింది. భారత్ ఇన్నింగ్స్ సమయంలోనూ ఇలాంటి భారీ పార్టనర్‌షిప్ పడుంటే మరోలా ఉండేది. అక్షర్-శ్రేయస్ అద్భుతంగా ఆడారు. కొత్తగా క్రీజ్‌లోకి వచ్చిన బ్యాటర్‌కు బ్యాటింగ్ చేయడం అంత సులువేం కాదు’’ రోహిత్ వెల్లడించాడు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Kalyan Ram: ఆయనతో నన్ను పోల్చవద్దు.. అంత పెద్దవాణ్ని కాదు: కళ్యాణ్‌రామ్
-
Crime News
Hyderabad: దేశవ్యాప్తంగా వ్యక్తిగత డేటా చోరీ.. పోలీసుల అదుపులో ముఠా
-
Movies News
Samyuktha: ‘విరూపాక్ష’ టీమ్‌పై నటి సంయుక్త ఆగ్రహం
-
India News
Kerala: సమాధిపై క్యూఆర్ కోడ్!.. వైద్యుడైన కుమారుడి స్మృతులకు కన్నవారి నివాళి
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Mission venus: 2028లో శుక్రగ్రహ మిషన్!: ఇస్రో అధిపతి సోమనాథ్