Sachin Tendulkar: ఎన్నికల ప్రచారకర్తగా సచిన్‌ తెందూల్కర్‌: ఈసీ

క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్‌ (Sachin Tendulkar)ను భారత ఎన్నికల సంఘం ( Election Commission ) ‘ఎన్నికల ప్రచారకర్త’గా నియమించనుంది. 

Published : 22 Aug 2023 19:07 IST

ఇంటర్నెట్ డెస్క్: ఎన్నికల ప్రక్రియలో ఓటరు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్‌ (Sachin Tendulkar)ను భారత ఎన్నికల సంఘం (Election Commission) ‘ఎన్నికల ప్రచారకర్త’గా నియమించనుంది. బుధవారం దిల్లీలోని రంగ్ భవన్ ఆడిటోరియంలో సచిన్‌తో ఎన్నికల సంఘం ఒప్పందం కుదుర్చుకోనుంది. ఇందులో భాగంగా ఓటింగ్‌పై సచిన్‌ మూడేళ్ల పాటు అవగాహన కల్పించనున్నారు.

‘రోహిత్‌ శర్మను 2011 ప్రపంచకప్‌నకు ఎంపిక చేద్దామనుకున్నాం.. ధోనీ వద్దన్నాడు’

రాబోయే ఎన్నికల్లో ముఖ్యంగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో యువ ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచడానికి ఈ ఒప్పందం ఎంతోగానో ఉపయోగపడుతుందని ఎన్నికల సంఘం పేర్కొంది. పట్టణ ప్రాంతాలు, యువతలో ఓటింగ్ పట్ల ఉన్న ఉదాసీనతలో మార్పు తీసుకువచ్చేందుకు ఈసీ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. ఇందుకు కోసం కొన్నేళ్లుగా మనదేశంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ‘ప్రచారకర్త’లుగా నియమిస్తోంది. గతేడాది బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠిని ప్రచారకర్తగా నియమించింది. అంతకుముందు మాజీ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ, నటుడు ఆమీర్ ఖాన్, మహిళా బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ కూడా ఎన్నికల ప్రచారకర్తలుగా వ్యవహరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని