Shoaib Malik: మరో పెళ్లి చేసుకున్న షోయబ్‌ మాలిక్‌

పాకిస్థాన్‌ క్రికెట్ జట్టు మాజీ సారథి షోయబ్ మాలిక్‌(Shoaib Malik) మరో వివాహం చేసుకున్నారు.

Updated : 20 Jan 2024 16:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్‌ క్రికెట్ జట్టు మాజీ సారథి షోయబ్ మాలిక్‌(Shoaib Malik) మరో వివాహం చేసుకున్నారు. నటి సనా జావేద్‌ను పెళ్లి చేసుకున్నట్లు ఆయన సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించారు. ఇంతకుముందు షోయబ్‌ మాలిక్‌కు భారత టెన్నిస్ స్టార్‌ సానియా మీర్జాతో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. వీరి విడాకుల గురించి వార్తలు వస్తోన్న తరుణంలో ఈ ఫొటోలు వెలుగులోకి రావడం గమనార్హం. 

షోయబ్-సానియా విడిపోతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం విడాకులు అనేది చాలా కష్టమంటూ సానియా సోషల్ మీడియాలో పోస్టుపెట్టారు. అది వైరల్‌గా మారిన తరుణంలో మాలిక్ మరో వివాహం గురించి నేడు ప్రకటన చేశారు. ఆయనకు ఇది మూడో పెళ్లి కావడం గమనార్హం. 2010లో అయేషాతో విడాకులు తీసుకున్న ఆయన.. అదే ఏడాది సానియాను వివాహమాడారు. ఈ వేడుక అప్పట్లో అందర్నీ ఆకర్షించింది. 2018లో వారికి కుమారుడు జన్మించాడు. మరోవైపు సనా జావేద్‌కు కూడా ఇంతకుముందే వివాహం జరిగింది. 2020లో పాక్‌కు చెందిన ఓ సింగర్‌ను పెళ్లిచేసుకున్న ఆమె.. 2023లో అతడితో విడిపోయింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని