ICC Rankings: నంబర్ వన్‌ స్థానాన్ని కోల్పోయిన శుభ్‌మన్ గిల్.. టాప్‌లోకి పాక్‌ ప్లేయర్!

టీమ్‌ఇండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌ ర్యాంకును కోల్పోయాడు. 

Published : 20 Dec 2023 22:40 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌ ర్యాంకును కోల్పోయాడు. బుధవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్‌ బ్యాటర్ బాబర్‌ అజామ్‌ (824 పాయింట్లు).. గిల్‌ (810)ని వెనక్కినెట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్‌ శర్మ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్‌ మహరాజ్‌ నంబర్‌ వన్‌ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. జోష్ హేజిల్‌వుడ్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. సిరాజ్‌, ఆడమ్‌ జంపా, జస్‌ప్రీత్‌ బుమ్రా వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. కుల్‌దీప్‌ యాదవ్ ఎనిమిదో స్థానంలో, రవీంద్ర జడేజా 22వ స్థానాల్లో నిలిచారు. 

టీ20ల్లో బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్‌ అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. రషీద్‌ఖాన్‌ ఒక స్థానం కోల్పోయి రెండో స్థానంలో,  భారత యువ స్పిన్నర్ రవిబిష్ణోయ్‌ రెండు స్థానాలు దిగజారి మూడో స్థానానికి పడిపోయారు. ఇక, ఆదిల్‌ రషీద్‌ కనీస ధర రూ.2 కోట్లతో  ఐపీఎల్ 2024 మినీ వేలం బరిలో నిలిచాడు. కానీ, అతడిని తీసుకోవడానికి ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపలేదు. దీంతో అన్‌సోల్డ్‌గానే మిగిలిపోవాల్సి వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని