Womens Cricket: రోహిత్‌ శర్మలా ఆడాలని ఉంది: అలిస్సా హేలి

ఫార్మాట్లతో సంబంధం లేకుండా టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మలా ఆడాలని ఉందని ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్‌ అలిస్సాహేలీ ఆశాభావం వ్యక్తం చేసింది. త్వరలో ఆ జట్టు టీమ్‌ఇండయాతో...

Published : 15 Sep 2021 23:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఫార్మాట్లతో సంబంధం లేకుండా టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మలా ఆడాలని ఉందని ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్‌ అలిస్సాహేలీ పేర్కొంది. త్వరలో ఆ జట్టు టీమ్‌ఇండయాతో మూడు వన్డేలు, ఒక డే/నైట్‌ టెస్టుతో పాటు మూడు టీ20ల సిరీస్‌లు ఆడనుంది. దీంతో రాబోయే మ్యాచ్‌ల్లో హిట్‌మ్యాన్‌లా ఆడాలని అనుకుంటున్నట్లు అలిస్సా తెలిపింది.

టెస్టు క్రికెట్‌లో తాను ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లే ఆడానని, దాంతో తగినంత అనుభవం లేదని చెప్పింది. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియాతో ఆడే డే/నైట్‌ టెస్టు తనకు కష్టమని తెలిపింది. వన్డే క్రికెట్‌లో ఆడినట్లే ఇక్కడా ఆడే అవకాశం ఉందనింది. ‘నేను ఆధునిక టెస్టు క్రికెట్‌ చూస్తున్నా. అదెంతగా మారిపోయిందో గమనించా. అలాగే రోహిత్ శర్మ లాంటి వ్యక్తిని చూసి స్ఫూర్తి పొందుతా. అతడు ప్రపంచంలోనే అత్యంత విధ్వంసకమైన బ్యాట్స్‌మెన్‌లో ఒకడు. ఇప్పుడు టెస్టు క్రికెట్‌లోనూ విజయవంతంగా కొనసాగుతున్నాడు. ఫార్మాట్లకు అతీతకంగా రోహిత్‌ తన ఆటను ఎలా మలుచుకుంటాడా అని ఆలోచిస్తా. నేను కూడా అలా ఆడగలానా?అని అనుకుంటా’ అని అలిస్సా వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని