
Sachin Tendulkar: ఎడమచేత్తో సచిన్ గోల్ఫ్.. ఎవరు సాయం చేస్తున్నారో తెలుసా!
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాక చాలామంది క్రికెటర్లు చేసే పనేంటో తెలుసా? గోల్ఫ్ క్రీడలో శిక్షణ పొందడం.. కాలం గడిపేందుకు దానినే ఆడటం. కపిల్ దేవ్ వంటి దిగ్గజాలు ఇప్పటికే గోల్ఫ్‌లో ప్రొఫెషనల్ స్థాయిలో రాణిస్తున్నారు.
ఆసక్తికరమైన విషయం ఏంటంటే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ సైతం గోల్ఫ్ ప్రేమికుడే! ఆయన అద్భుతంగా గోల్ఫ్ ఆడతారు. సాధారణంగా సచిన్‌ది కుడిచేతి వాటం. కానీ ఆయన ఎడమచేతితో గోల్ఫ్ ఆడి అలరించారు. అందుకు ఒకరు సాయం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను మాస్టర్ ట్వీట్ చేశారు.
‘గాయ్స్..! నేను సవ్యసాచిని (రెండు చేతులతో పనిచేసేవారు). నేడు లెఫ్ట్ హ్యాండర్స్ డే. సాధారణంగా నేను కుడిచేత్తోనే ఆడతాను. ఈ సారి మాత్రం ఎడమచేత్తో ప్రయత్నిస్తాను. మరి సరిగ్గా ఆడేందుకు నాకెవరు సాయం చేస్తున్నారో తెలుసా?’ అని సచిన్ అన్నాడు. అప్పుడు ‘మాస్టర్ బ్లాస్టర్ లాగే బాదేయండి’ అంటూ అప్పుడే యువరాజ్ సింగ్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో సచిన్ బయటకు వెళ్లడం లేదు. ఎక్కువగా ఇంటవద్దే ఉంటున్నాడు. లేదంటే తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి కాలం గడుపుతున్నాడు. ఇంట్లోవాళ్లకు వెరైటీ వంటకాలు పరిచయం చేస్తున్నాడు. మూగ జీవాలను పెంచుతున్నాడు. ఈ మధ్యే ‘స్పైక్’ అనే ఒక బుజ్జి కుక్కపిల్లను అందరికీ పరిచయం చేసిన సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.