కోహ్లీ ఇలా ఔటవ్వడం ఇదే తొలిసారి 

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ(0) అనూహ్య రీతిలో ఔటయ్యాడు. జట్టు స్కోర్‌ 85 పరుగుల వద్ద పుజారా(21)...

Updated : 13 Feb 2021 14:22 IST

ఆ వికెట్‌ తీసింది మోయిన్‌ అలీ..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ(0) అనూహ్య రీతిలో ఔటయ్యాడు. జట్టు స్కోర్‌ 85 పరుగుల వద్ద పుజారా(21) ఔటైన తర్వాతి ఓవర్‌లోనే కెప్టెన్‌ సైతం పెవిలియన్‌ చేరాడు. దీంతో భారత్‌ 86 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. అయితే, కోహ్లీ ఇలా స్పిన్నర్‌ చేతిలో డకౌటవ్వడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 26 సార్లు అతడు సున్నా పరుగులకే ఔటయ్యాడు. కానీ అందులో ఒక్కసారి కూడా ఏ స్పిన్నర్‌ చేతిలో ఔటవ్వలేదు. దీంతో కోహ్లీని డకౌట్‌ చేసిన తొలి స్పిన్నర్‌గా మోయిన్‌ అలీ నిలిచాడు.

ఇంతకుముందు 2015లో శ్రీలంకతో జరిగిన గాలే టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్‌ తరిండు కౌశల్‌ చేతిలో కోహ్లీ(3) టెస్టుల్లో అత్యల్ప స్కోరుకు ఔట్‌ చేశాడు. ఆ తర్వాత మోయిన్‌ అలీనే సున్నా పరుగులకు ఔట్‌ చేశాడు. మరోవైపు టీమ్‌ఇండియా సారథి రెండు వరుస ఇన్నింగ్స్‌ల్లో బౌల్డవ్వడమూ ఇదే తొలిసారి. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో విరాట్‌ 72 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద బెన్‌స్టోక్స్‌ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. ఆ మ్యాచ్‌లో భారత్‌ ఓటమిపాలైంది. ఇప్పుడు రెండో టెస్టులో టాస్‌ గెలిచిన సందర్భంగా కోహ్లీ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. కానీ డకౌట్‌గా వెనుతిరిగి అభిమానులను నిరాశపర్చాడు. అలాగే అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్‌ శతకం సాధించి 14 నెలలు కావస్తోంది. 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌పై చివరిసారి మూడంకెల స్కోర్‌ సాధించాడు. దీంతో అప్పటి నుంచి అతడి 71వ శతకం గురించి అభిమానులు ఎదురు చూస్తున్నారు. కోహ్లీ ఇప్పటివరకు మొత్తం 70 శతకాలు సాధించిన సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి..
సమాజానికి ఏమైంది.. మనం ఎటు పోతున్నాం 
మీకు మసాలా దొరకదు: అజింక్య ఆవేశం!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు