Virat Kohli: కోహ్లీ అడుగుపెడితే స్టేడియం దద్దరిల్లింది.. వీడియో చూడండి..!

టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీకి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఘన స్వాగతం లభించింది. ఐపీఎల్‌లో తొలి సీజన్‌ నుంచీ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు...

Published : 14 Mar 2022 01:55 IST

బెంగళూరు: టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీకి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఘన స్వాగతం లభించింది. ఐపీఎల్‌లో తొలి సీజన్‌ నుంచీ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున ఆడుతున్న అతడికి ఈ నగరంతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఇక్కడ విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సొంతం చేసుకున్నాడు. దీంతో దిల్లీ కన్నా బెంగళూరే అతడికి హోమ్‌ గ్రౌండ్‌లా మారింది. ఇక తాజాగా శ్రీలంకతో జరుగుతున్న పింక్‌బాల్‌ టెస్టులో అతడు శనివారం తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేయడానికి మైదానంలోకి రాగా.. అభిమానులు కేరింతలతో స్వాగతం పలికారు. దీంతో స్టేడియం మొత్తం ఒక్కసారిగా దద్దరిల్లింది.

ఇదిలా ఉండగా, ఈ టీమ్‌ఇండియా మాజీ సారథి రెండేళ్లకు పైగా శతకం సాధించలేక ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో గతవారం మొహాలి వేదికగా జరిగిన తన వందో టెస్టులోనైనా సెంచరీ కొడతాడని అభిమానులు ఆశించారు. కానీ, అది జరగలేదు. ఇప్పుడిక బెంగళూరులో ఆడే రెండో టెస్టులోనైనా ఆ లోటు తీరుస్తాడని ఆశించిన అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియానికి తరలివచ్చారు. ఈ క్రమంలోనే రోహిత్‌ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన విరాట్‌ను చూసి అభిమానులు పెద్ద ఎత్తున కేకలు పెట్టారు. ఆ వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో అభిమానులతో పంచకుంది. మీరూ అది చూసి ఆస్వాదించండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని