Ricky Ponting: వార్న్‌కు ఆ విషయం చెప్పలేకపోయా.. పాంటింగ్ భావోద్వేగం
తన సహచర ఆటగాడు, లెజెండరీ స్పిన్నర్ షేన్‌వార్న్‌ను ఎంతగా ప్రేమిస్తానో చెప్పలేకపోయానని ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్ విచారం వ్యక్తం చేశాడు. వార్న్ గత శుక్రవారం థాయ్‌లాండ్‌లోని...
ఇంటర్నెట్‌డెస్క్: తన సహచర ఆటగాడు, లెజెండరీ స్పిన్నర్ షేన్‌వార్న్‌ను ఎంతగా ప్రేమించానో చెప్పలేకపోయానని ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్ విచారం వ్యక్తం చేశాడు. వార్న్ గత శుక్రవారం థాయ్‌లాండ్‌లోని ఓ విల్లాలో హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఐసీసీతో మాట్లాడిన పాంటింగ్.. ఇప్పటికీ తన స్నేహితుడు లేడనే నిజాన్ని నమ్మలేకపోతున్నానని అన్నాడు. ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ ఇషా గుహ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాంటింగ్ భావోద్వేగం చెందాడు.
‘షేర్న్వార్న్ను నేను ఎంతగా ప్రేమిస్తానో చాలా మంది యువకులతో పంచుకున్నా. కానీ.. ఈ విషయాన్ని అతడికి చెప్పలేకపోయా’ అని వివరిస్తూ రికీ ఉబికివస్తోన్న దుఃఖాన్ని దిగమింగుకున్నాడు. వార్న్ ఒక గురువు లాంటోడని.. ఎప్పుడూ యువ క్రికెటర్లకు తన విలువైన సలహాలు, సూచనలు చేసేవాడని గుర్తుచేసుకున్నాడు. స్పిన్ దిగ్గజం చనిపోయాక అతడితో ఆడిన ఎంతో మంది స్పిన్నర్ల ఫొటోలు చూశానని చెప్పాడు. స్టీవ్‌స్మిత్, రషీద్‌ఖాన్ లాంటి స్టార్ ఆటగాళ్లకు కూడా వార్న్ తొలినాళ్లలో సహాయం చేశాడన్నాడు. ఇకపై షేన్‌వార్న్ గురించి మాట్లాడాల్సిన అవకాశాలు వచ్చినప్పుడల్లా అతడి నుంచి తానేం నేర్చుకున్నాననే విషయాలు వెల్లడించాలనుకుంటున్నట్లు పాంటింగ్ వివరించాడు.
ఇక వార్న్ మరణ వార్త తెలియగానే షాక్‌కు గురయ్యానని, మొదట నమ్మలేకపోయానని పాంటింగ్ పేర్కొన్నాడు. ‘నేను ఆరోజు ఉదయం నిద్రలేవగానే మా పిల్లల్ని నెట్‌బాల్ ప్రాక్టీస్‌కు తీసుకెళ్లాలని చూస్తున్నా. అప్పుడే నా భార్య తన ఫోన్ చూస్తూ షేన్‌వార్న్ గురించి చెప్పింది. వెంటనే ఆ ఫోన్ లాగేసుకొని వార్తలు చూశా. నమ్మలేకపోయా. ఇప్పటికీ అలాగే అనిపిస్తోంది. వార్న్ లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా’ అని ఆస్ట్రేలియా మాజీ సారథి భావోద్వేగం చెందాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అతడు చాలా సేపు బంతిని బౌండరీ దాటించలేకపోయాడు : విరాట్ స్ట్రైక్‌రేట్‌పై గావస్కర్
హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్‌లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్‌గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్‌లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో సన్‌రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్‌రౌండర్ గుల్బాదిన్ నయీబ్‌తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్‌రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్‌లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్‌లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్‌రేట్‌పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్‌గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్