Dhoni-IPL: ఐపీఎల్ 2023 తర్వాత ధోనీ రిటైర్ అవుతాడా? చాట్‌జీపీటీ సమాధానం ఇదే..
మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్-16 సీజన్ తర్వాత ఎం.ఎస్.ధోనీ (MS Dhoni) ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ప్రచారం జరుగుతోంది. ధోనీ రిటైర్మెంట్ గురించి చాట్‌జీపీటీ (ChatGPT) అడగ్గా అది ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకున్న మహేంద్ర సింగ్ ధోనీ.. కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. అయితే.. మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్-16 సీజన్ తర్వాత ధోనీ.. ఈ మెగా టోర్నీకీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ప్రచారం జరుగుతోంది. దీనిపై కెప్టెన్ కూల్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ధోనీ అభిమానులు మాత్రం ఈ వార్తలతో ఆందోళనకు గురవుతున్నారు. సాంకేతిక ప్రపంచంలో సరికొత్త సంచలనం, కృత్రిమ మేధ (Artificial Intelligence) ఆధారంగా పనిచేసే చాట్‌జీపీటీ (ChatGPT)ని ధోనీ రిటైర్మెంట్ గురించి అడగ్గా అది ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది.
‘‘నా వద్ద ధోనీకి సంబంధించిన అంతర్గత సమాచారం గానీ, అతడి వ్యక్తిగత ఆలోచనలు, ప్రణాళికలు లేవు. అందువల్ల, ధోనీ IPL 2023 తర్వాత రిటైర్ అవుతాడో లేదో నేను కచ్చితంగా అంచనా వేయలేను. ధోనీ రిటైర్మెంట్ తీసుకోవాలా.. వద్దా అనేది.. అతడి ఫిట్‌నెస్, ఫామ్, క్రికెట్‌లో ఇంకా కొనసాగాలనే ఆసక్తి వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. వీటి ఆధారంగానే అతడు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రిటైర్మెంట్ అనేది వ్యక్తిగత నిర్ణయం అని గమనించాలి. వ్యక్తిగత పరిస్థితులు, ప్రాధాన్యతల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకోవాలి’ అని చాట్‌జీపీటీ తనదైన శైలిలో సమాధానమిచ్చింది.
‘ధోనీ రిటైర్మెంట్ భారత క్రికెట్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందనేది కూడా పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. ధోనీ భారతదేశంలోని చాలా మంది యువ క్రికెటర్లకు స్ఫూర్తి. అతడి రిటైర్మెంట్ జట్టు నాయకత్వంలో శూన్యతను కలిగిస్తుంది. ఈ అంశంలో నేను కచ్చితమైన సమాధానం ఇవ్వలేను. కానీ, ఈ సమాచారం మీరు ఓ అంచనాకు రావడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా’ అని చాట్‌జీపీటీ వెల్లడించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Odisha Train Tragedy: అంతా 20 నిమిషాల వ్యవధిలోనే.. నిద్రలోనే మృత్యుఒడిలోకి..!
-
India News
Ashwini Vaishnaw: రైలు ప్రమాద కారణాలను ఇప్పటికిప్పుడు చెప్పలేం: కేంద్ర మంత్రి
-
World News
అడవిలో.. పాపం పసివాళ్లు ఏమయ్యారో!
-
India News
Deemed University Status: డీమ్డ్ యూనివర్సిటీ హోదాకు కొత్త నిబంధనలు
-
Ts-top-news News
Delhi Liquor Policy Case: ఈడీ అధికారులు బెదిరించడం వల్లే కవిత పేరు చెప్పారు
-
General News
Odisha Train Accident : అక్కడి వాతావరణం భీతావహం.. ‘ఈనాడు’తో ఏపీ ప్రయాణికులు