Rohit sharma: రోహిత్ కెప్టెన్సీకి యువరాజ్ సింగ్ ఇచ్చిన రేటింగ్ ఎంతంటే?
రోహిత్ శర్మ కెప్టెన్సీకి యువరాజ్ సింగ్ ఇచ్చిన రేటింగ్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
దిల్లీ: కెప్టెన్‌గా మహేంద్రసింగ్ ధోని(Mahendrasingh dhoni) వైదొలిగిన తర్వాత టీమ్ఇండియా(Team india) ముందు ఉన్న ఏకైక లక్ష్యం ఐసీసీ(ICC) ట్రోఫీని గెలవడమే. రోహిత్ శర్మ(Rohit sharma) నేతృత్వంలో ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్(T20 World cup)తోనూ ఈ కల నెరవేరలేదు. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ ముంగిట బంగ్లాదేశ్‌తో తొలి వన్డేలో టీమ్ఇండియా బ్యాటింగ్ వైఫల్యం బయటపడింది. ఈ నేపథ్యంలో రోహిత్ విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఓ క్రీడా వెబ్సైట్ రోహిత్ కెప్టెన్సీపై పోల్‌ను నిర్వహించింది. దీనిపై నెటిజన్లు తమ స్పందనను రేటింగ్ రూపంలో తెలియజేశారు. ఈ పోల్‌లో యువరాజ్ సింగ్ సైతం పాల్గొని ఆశ్చర్యపరిచాడు. రోహిత్ కెప్టెన్సీకి తాను పదికి పది మార్కులు ఇస్తానని కామెంట్ చేశాడు. జాతీయ జట్టు తరఫున అద్భుతమైన ప్రదర్శనలు చేసిన రోహిత్‌కు యువీ ఇచ్చిన రేటింగ్ సరైందేనని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
K.Viswanath: కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత
-
General News
Telangana News: కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం
-
World News
Saudi Arabia: ఈ యువరాజు హయాంలో.. రికార్డు స్థాయి మరణశిక్షలు..!
-
India News
Jammu Kashmir: కశ్మీర్ ఉగ్రవాదుల కొత్త ఆయుధం.. పెర్ఫ్యూమ్ బాంబ్!
-
Sports News
PCB: పీసీబీ నిర్ణయం.. పాక్ క్రికెట్ వ్యవస్థకు ఎదురుదెబ్బ: మిస్బాఉల్ హక్
-
Crime News
Bull Race: ఎడ్ల పందేలకు అనుమతివ్వలేదని..వాహనాలపై రాళ్ల వర్షం