కొత్త ఫోన్‌: అర గంటలో 100% ఛార్జింగ్‌

రెడ్‌మీకి పోటీగా అమ్మకాల్లో దూసుకెళ్తున్న మరో స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ రియల్‌మీ. అమ్మకాల పరంగా భారత్‌లో మూడో స్థానంలో ఉంది. తాజాగా ఈ కంపెనీ మరో కొత్త స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది...

Updated : 30 Aug 2022 16:22 IST

ఇంటర్నెట్‌డెస్క్: రెడ్‌మీకి పోటీగా అమ్మకాల్లో దూసుకెళ్తున్న మరో స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ రియల్‌మీ. అమ్మకాల పరంగా భారత్‌లో మూడో స్థానంలో ఉంది. తాజాగా ఈ కంపెనీ మరో కొత్త స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఫాస్ట్‌ ఛార్జింగ్, ఉన్నతమైన ఫొటోగ్రఫీ అనుభూతిని అందిచడమే లక్ష్యంగా రియల్‌మీ 7, 7ప్రో పేరుతో ఈ ఫోన్లను విడుదల చేసింది. వీటి ఫీచర్లు ఇలా ఉన్నాయి.

రియల్‌మీ 7ప్రో

ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్‌మీ యుఐ ఓఎస్‌తో పనిచేస్తుంది. స్నాప్‌డ్రాగన్‌ 720జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 6.4 అంగుళాల సూపర్‌ అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఈ ఫోన్‌లో మొత్తం ఐదు కెమెరాలు ఉన్నాయి. వెనకవైపున నాలుగు, ముందు ఒక కెమెరా ఇస్తున్నారు. తొలిసారిగా రియల్‌మీలో ఏఐ కలర్‌ పొట్రేయిట్ ఫీచర్‌ను 7ప్రోలో ఇస్తున్నారు. దీంతో ఫొటో/వీడియోలలో మనకు కావాల్సిన ప్రదేశాన్ని మాత్రం కలర్‌లో, విగిలిన భాగాన్ని గ్రే కలర్‌లోకి మార్చుకోవచ్చు. వెనకవైపున సెకండ్ జనరేషన్ 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరాతో పాటు 8ఎంపీ కెమెరా, 2 మెగాపిక్సెల్ కెమెరాలు రెండు ఉన్నాయి. ముందు 32 మెగాపిక్సెల్‌ హై రిజల్యూషన్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇందులో ప్రోట్రెయిట్‌ బోఖే, హెచ్‌డీఆర్‌, ఏఐ బ్యూటిఫికేషన్, నైట్‌స్కేప్‌ ఫీచర్స్‌ ఉన్నాయి. వీటి సహాయంతో హై క్లారిటీ సెల్ఫీలను తీసుకోవచ్చు.

ఈ ఫోన్‌లో ముఖ్యంగా ఛార్జింగ్ సామర్థ్యం గురించి చెప్పుకోవాలి. 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది సూపర్‌ డార్ట్ ఫాస్ట్ టెక్నాలజీతో 65 వాట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అంటే సాధారణ పోన్లతో పోలిస్తే 7ప్రో మూడురెట్లు వేగంగా కేవలం అరగంటలో వంద శాతం ఛార్జ్ అవుతుంది. అంతేకాకుండా సౌండ్ ఎక్స్‌పీరియన్స్‌ కోసం డాల్బీ అట్‌మోస్‌తో రెండు స్టీరియో స్పీకర్స్‌ ఉన్నాయి. 

రియల్‌మీ 7

ఈ ఫోన్‌లో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఇస్తున్నారు. ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్‌మీ యుఐ ఓఎస్‌తో పనిచేస్తుంది. ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ హీలియో జీ95 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. మొత్తం ఐదు కెమెరాలు ఉన్నాయి. వెనక నాలుగు, ముందు ఒకటి ఇస్తున్నారు. వెనకవైపున 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 8ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ కెమెరాలు రెండు ఇస్తున్నారు. సెల్ఫీల కోసం ముందు 16 ఎంపీ కెమెరా అమర్చారు. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 30 వాట్ డార్ట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

ధర

రియల్‌మీ 7 ప్రో 6జీబీ ర్యామ్‌/128జీబీ ఇంటర్నల్ స్టోరేజి ధర రూ. 19,999గాను, 8జీబీ ర్యామ్‌/128జీబీ అంతర్గత మెమరీ వేరియంట్ ధర రూ. 21,999గా సంస్థ నిర్ణయించింది. మిర్రర్ బ్లూ, మిర్రర్ వైట్ రంగుల్లో ఇది లభించనుంది. సెప్టెంబరు 14 నుంచి రియల్‌మీ.కామ్, ఫ్లిప్‌కార్ట్‌లలో ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. ఇక రియల్‌మీ 7 మోడల్ 6జీబీ ర్యామ్‌/64జీబీ వేరియంట్ ధర రూ.14,999, 8జీబీ ర్యామ్‌/128జీబీ ధర రూ. 16,999. సెప్టెంబరు 10 నుంచి రియల్‌మీ.కామ్‌, ఫ్లిప్‌కార్ట్‌లలో అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. మిస్ట్ బ్లూ, మిస్ట్ వైట్ రంగుల్లో లభించనుంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని