నచ్చిన ఫొటోల స్లైడ్‌షో

ఇష్టమైన ఫొటోలను స్లైడ్‌ షోగా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా. విండోస్‌ పీసీ వాడేవారు తమకు తామే దీన్ని సృష్టించుకోవచ్చు. నచ్చిన వాల్‌పేపర్లు, ఫొటోలను ఒక ఫోల్డర్‌లో వేయాలి.

Published : 17 Jan 2024 00:06 IST

ఇష్టమైన ఫొటోలను స్లైడ్‌ షోగా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా. విండోస్‌ పీసీ వాడేవారు తమకు తామే దీన్ని సృష్టించుకోవచ్చు. నచ్చిన వాల్‌పేపర్లు, ఫొటోలను ఒక ఫోల్డర్‌లో వేయాలి. అనంతరం డెస్క్‌టాప్‌ మీద రైట్‌ క్లిక్‌ చేసి, పర్సనలైజ్‌ ద్వారా చూజ్‌ యువర్‌ డెస్క్‌టాప్‌ బ్యాక్‌గ్రౌండ్‌లోకి వెళ్లాలి. ఇందులో బ్యాక్‌గ్రౌండ్‌ సెటింగ్‌ను స్లైడ్‌షోగా మార్చుకోవాలి. తర్వాత నిర్ణయించుకున్న ఫోల్డర్‌ను ఎంచుకోవాలి. తర్వాత ఒక్కో ఇమేజ్‌ ఎంతసేపు కనిపించాలో సెట్‌ చేసుకోవాలి. అంతే. ఫోల్డర్‌లోని ఇమేజ్‌లన్నీ వరుసగా వచ్చి పోతుంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని