ఐఫోన్‌కు మరింత భద్రత

యాపిల్‌ సంస్థ ఐఓఎస్‌ 17.3 బీటాతో ఐఫోన్ల కోసం గొప్ప భద్రత ఫీచర్‌ను పరిచయం చేసింది. దీని పేరు స్టోలెన్‌ డివైస్‌ ప్రొటెక్షన్‌. పేరుకు తగ్గట్టుగానే ఫోన్‌ను ఎవరైనా దొంగిలించినప్పుడు యాపిల్‌ ఖాతాను కాపాడుకోవటానికిది ఉపయోగపడుతుంది. బహిరంగ ప్రదేశాల్లో ఐఫోన్‌ దొంగతనాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టారు.

Published : 31 Jan 2024 00:04 IST

యాపిల్‌ సంస్థ ఐఓఎస్‌ 17.3 బీటాతో ఐఫోన్ల కోసం గొప్ప భద్రత ఫీచర్‌ను పరిచయం చేసింది. దీని పేరు స్టోలెన్‌ డివైస్‌ ప్రొటెక్షన్‌. పేరుకు తగ్గట్టుగానే ఫోన్‌ను ఎవరైనా దొంగిలించినప్పుడు యాపిల్‌ ఖాతాను కాపాడుకోవటానికిది ఉపయోగపడుతుంది. బహిరంగ ప్రదేశాల్లో ఐఫోన్‌ దొంగతనాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. దుండగులు ముందుగా ఐఫోన్‌ను వాడేవారిని గమనించి, పాస్‌కోడ్‌ను తెలుసుకుంటున్నారు. ఆ తర్వాత ఫోన్‌ను కొట్టేసి యాపిల్‌ ఐడీ పాస్‌వర్డ్‌లను మార్చేస్తున్నారు. ఇలా ఫోన్‌ యజమానులను యాపిల్‌ ఖాతాల్లోకి వెళ్లకుండా నిలువరిస్తున్నారు. స్టోలెన్‌ డివైస్‌ ప్రొటెక్షన్‌ ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా కాపాడుతుంది. విశ్వసనీయం కాని స్థలాల్లో బయోమెట్రిక్‌ ధ్రువీకరణ.. అంటే వేలి ముద్రలు లేదా ఫేస్‌ ఐడీ ద్వారానే సెటింగ్స్‌ను మార్చుకోవటానికిది వీలు కల్పిస్తుంది. దీన్ని ఎనేబుల్‌ చేసుకోవాలంటే..

  • సెటింగ్స్‌లోకి వెళ్లి, జనరల్‌ మీద తాకాలి. సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ను క్లిక్‌ చేసి, ఇన్‌స్టాల్‌ నౌ మీద నొక్కాలి. ఫోన్‌కు 17.3 బీటా అప్‌డేట్‌ అందుబాటులో ఉంటే అప్పుడు డౌన్‌లోడ్‌ అండ్‌ ఇన్‌స్టాల్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. దీన్ని తాకి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అనంతరం పాస్‌కోడ్‌ను ఎంటర్‌ చేసి, ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. అనంతరం సెటింగ్స్‌ ద్వారా ఫేస్‌ ఐడీ అండ్‌ పాస్‌కోడ్‌ విభాగంలోకి వెళ్లాలి. పాస్‌కోడ్‌ను ఎంటర్‌ చేసి, స్టోలెన్‌ డివైస్‌ ప్రొటెక్షన్‌ కింద టర్న్‌ ఆన్‌ ప్రొటెక్షన్‌ మీద నొక్కాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని