Telangana News: రాయితీ చలానాల గడువు పొడిగింపు

ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడిన వారికి రాయితీపై చలానాలు చెల్లించే గడువును మరో 15 రోజుల వరకూ పెంచుతున్నట్లు హోంమంత్రి మహమూద్‌ అలీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల

Updated : 31 Mar 2022 05:26 IST

మరో 15 రోజులు వెసులుబాటు

ఈనాడు, హైదరాబాద్‌: ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడిన వారికి రాయితీపై చలానాలు చెల్లించే గడువును మరో 15 రోజుల వరకూ పెంచుతున్నట్లు హోంమంత్రి మహమూద్‌ అలీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. రాయితీలపై చలానాలు చెల్లించేందుకు మార్చి 1 నుంచి ప్రభుత్వం ఇచ్చిన అవకాశం 31వ తేదీతో ముగిసిపోనుంది. రాష్ట్రంలో మొత్తం 2.40 కోట్ల చలానాలు విధించారని, వీటి విలువ రూ.840 కోట్లని హోంమంత్రి తెలిపారు. రాయితీ ప్రకటించిన తర్వాత 30 రోజుల్లో చలానాల ద్వారా రూ.250 కోట్లు వసూలయ్యాయని, విశేష స్పందన రావడంతో ఈ అవకాశాన్ని ఏప్రిల్‌ 15 వరకూ పొడిగిస్తున్నామన్నారు.

అక్రిడిటేషన్‌ పాత్రికేయులకు మినహాయిపు

స్టిక్కర్లు ఉన్న వాహనాలపై జరిమానా విధింపు నుంచి విలేకరులను మినహాయించారు. హైదరాబాద్‌లో వాహనం మీద స్టిక్కర్‌ ఉంటే రూ.700 చొప్పున జరిమానా విధిస్తున్నారు. దీనివల్ల తమకు ఇబ్బందులు వస్తున్నాయని విలేకరులు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ సంయుక్త కమిషనర్‌ రంగనాథ్‌ దృష్టికి తీసుకెళ్లారు.  ప్రభుత్వం జారీ చేసిన అక్రిడిటేషన్‌ ఉన్న పాత్రికేయుల వాహనాలపై ప్రెస్‌ స్టిక్కర్లున్నా చలానా విధించవద్దని సిబ్బందిని ఆదేశించామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని