మానవ అక్రమ రవాణా అడ్డుకట్టకు ముందుకురావాలి

మానవ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు యువత, పౌరసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకురావాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వి.సునీతా లక్ష్మారెడ్డి కోరారు. దిల్లీలో శనివారం మానవ

Published : 26 Jun 2022 05:17 IST

రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి

ఈనాడు, దిల్లీ: మానవ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు యువత, పౌరసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకురావాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వి.సునీతా లక్ష్మారెడ్డి కోరారు. దిల్లీలో శనివారం మానవ అక్రమ రవాణా నిరోధానికి జాతీయ మహిళా కమిషన్‌, బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రీసెర్చ్‌ డెవలప్‌మెంట్‌ సంయుక్తంగా నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. అనంతరం సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. మానవ అక్రమ రవాణాను అడ్డుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం బాగుందని సదస్సులో పలువురు ప్రశంసించారని తెలిపారు. ప్రేమ పేరిట బాలికలను, సినిమాలు, ఉద్యోగ అవకాశాల పేరిట యువతులను, కుటుంబ అవసరాలు తీర్చే నెపంతో అమాయక, ఒంటరి మహిళలను లొంగదీసుకుని వారిని అక్రమంగా రవాణా చేస్తున్నారని, ఆ తరవాత వారిని సెక్స్‌ వర్కర్లుగా, కూలీలుగా, బాలకార్మికులుగా, యాచకులుగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమాచారం తెలిస్తే వెంటనే 100, మహిళా హెల్ప్‌లైన్‌ 181, మహిళా కమిషన్‌ వాట్సప్‌ నంబర్‌ 94905 55533, చైల్డ్‌లైన్‌ నంబర్‌ 1098కు తెలిపి అప్రమత్తం చేయాలని సూచించారు. ఆమె వెంట తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ కార్యదర్శి కృష్ణకుమారి కూడా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని