ఆగని కోకో దూకుడు..!

కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది.

Published : 26 Apr 2024 04:04 IST

కిలో గింజల ధర రూ.1000

అశ్వారావుపేట, న్యూస్‌టుడే: కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. గత ఐదు నెలల్లో  రూ.250 నుంచి రూ.వెయ్యికి చేరుకుంది. రైతులు అనూహ్యంగా పెరుగుతున్న ధరను చూసి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆదాయం పుష్కలంగా వస్తుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో అత్యధికంగా అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో కోకో సాగవుతోంది. ఆయిల్‌పాం,  కొబ్బరి తోటల్లో అంతరపంటగా దీనిని ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ రెండు మండలాల్లోనే సుమారు 5000 ఎకరాల్లో అంతరపంటగా సాగులో ఉంది. ప్రస్తుతం ఎండిన కోకో గింజలను విజయవాడ, ఏలూరు, రాజమండ్రి నుంచి వచ్చే వ్యాపారులు రైతు క్షేత్రాల వద్దే కొనుగోలు చేస్తున్నారు. క్యాడ్‌బరీ కంపెనీ ప్రధాన కొనుగోలుదారుగా ఉండగా, మాండ్‌లెజ్‌ కంపెనీ సైతం కొనుగోళ్లు చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని