జేఈఈ మెయిన్స్‌లో గురుకుల విద్యార్థుల ప్రతిభ

జేఈఈ మెయిన్స్‌లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.

Published : 26 Apr 2024 03:59 IST

ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్స్‌లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు. 57 మంది విద్యార్థులు 90కి పైన పర్సంటైల్‌ సాధించారని వివరించారు. గిరిజన గురుకుల సొసైటీలో 16 మంది 90కి పైగా పర్సంటైల్‌ సాధించారని పేర్కొన్నారు. బీసీ గురుకుల విద్యార్థుల్లో 44 మంది బాలురు, 28 మంది బాలికలు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించారని బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. 8 మంది బాలురు, ఆరుగురు బాలికలు 90కిపైగా పర్సంటైల్‌ సాధించారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు