ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం

హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్‌ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్‌ఫీల్డ్‌ నేషనల్‌ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు.

Published : 26 Apr 2024 04:05 IST

జాతీయ రహదారిపై రైతుల ధర్నా

దామెర, న్యూస్‌టుడే: హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్‌ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్‌ఫీల్డ్‌ నేషనల్‌ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. ప్రాణాలైనా ఇస్తాం కానీ గ్రీన్‌ఫీల్డ్‌ జాతీయరహదారికి తమ భూములను ఇవ్వబోమని తేల్చి చెప్పారు. పురుగుమందు డబ్బాలు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. రెండు గంటల పాటు ఈ ధర్నా కొనసాగడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రధాని మోదీ, ఎన్‌హెచ్‌ఏఐకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దహనం చేశారు. పోలీసులు రైతులను బలవంతంగా తరలించేందుకు ప్రయత్నించడంతో కొంతసేపు వాగ్వాదం జరిగింది. అనంతరం రైతులు ధర్నాను విరమించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని