సికింద్రాబాద్‌ నుంచి సంత్రాగచ్చికి జనరల్‌ బోగీల రైళ్లు

సికింద్రాబాద్‌ నుంచి కోల్‌కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్‌కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.

Published : 26 Apr 2024 04:03 IST

ఈనాడు, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ నుంచి కోల్‌కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్‌కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఇవన్నీ జనరల్‌ బోగీలు ఉండే అన్‌రిజర్వుడు రైళ్లు. ఏప్రిల్‌ 28 నుంచి జులై 2 వరకు రైళ్లు (నం.07234/0735) రాకపోకలు సాగిస్తాయి. నల్గొండ, మిర్యాలగూడ, ఏపీలో..నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, సామర్లకోట, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్‌, పలాస స్టేషన్లలో ఆగుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని