ఓటీఏ బకాయిలు చెల్లించండి.. లేదంటే హాజరుకండి

రైల్వే ఏసీ బోగీల్లో పనిచేసే మెకానిక్‌లు, అటెండర్లు, ఎస్కార్ట్‌ సిబ్బందికి ఓవర్‌ టైం ఎలవెన్స్‌(ఓటీఏ) చెల్లించాలంటూ గత ఏడాది ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు రైల్వే

Published : 07 Aug 2022 04:53 IST

రైల్వే ఉన్నతాధికారులకు హైకోర్టు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: రైల్వే ఏసీ బోగీల్లో పనిచేసే మెకానిక్‌లు, అటెండర్లు, ఎస్కార్ట్‌ సిబ్బందికి ఓవర్‌ టైం ఎలవెన్స్‌(ఓటీఏ) చెల్లించాలంటూ గత ఏడాది ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు రైల్వే పిటిషన్‌ను కొట్టివేసినా హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడాన్ని తప్పుబట్టింది. 4 వారాల్లోగా తమ ఉత్తర్వులను అమలు చేయాలని.. లేనిపక్షంలో ద.మ.రైల్వే జీఎం సంజీవ్‌కిశోర్‌, డీఆర్‌ఎం అభయ్‌కుమార్‌, సీనియర్‌ డివిజనల్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌ ప్రసాద్‌రావులు ఈ నెల 26న వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. ఓటీఏ చెల్లింపు ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై సికింద్రాబాద్‌ డివిజన్‌కు చెందిన కేఆర్‌కే రావు, మరో 105 మంది కోర్టు ధిక్కరణ పిటిషన్‌ వేశారు. దీనిపై జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌, జస్టిస్‌ తుకారాంజీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని