నేచర్‌ ఇండెక్స్‌ ర్యాంకుల్లో హెచ్‌సీయూ సత్తా

ప్రతిష్ఠాత్మక నేచర్‌ ఇండెక్స్‌ ర్యాంకుల్లో హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ) సత్తా చాటింది. దేశంలో విశ్వవిద్యాలయాల కేటగిరీలో ప్రథమ స్థానం దక్కించుకుంది. మొత్తమ్మీద 16వ స్థానం సాధించింది. 72 పరిశోధనపత్రాల సంఖ్య,

Published : 09 Aug 2022 04:09 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రతిష్ఠాత్మక నేచర్‌ ఇండెక్స్‌ ర్యాంకుల్లో హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ) సత్తా చాటింది. దేశంలో విశ్వవిద్యాలయాల కేటగిరీలో ప్రథమ స్థానం దక్కించుకుంది. మొత్తమ్మీద 16వ స్థానం సాధించింది. 72 పరిశోధనపత్రాల సంఖ్య, 19.46 షేర్‌తో ఆ స్థానం దక్కించుకున్నట్లు వర్సిటీ ఉపకులపతి ప్రొ.బీజే రావు తెలిపారు. ఈ ర్యాంకుల్లో బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ తొలిస్థానంలో నిలిచింది. ఈ సంస్థ ఆచార్యులకు సంబంధించి 194 పరిశోధనపత్రాలు నేచర్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. తెలుగు రాష్ట్రాల నుంచి పలు విద్యాసంస్థలూ చోటు దక్కించుకున్నాయి. ఐఐటీ హైదరాబాద్‌కు 23వ ర్యాంకు, ఐసెర్‌ తిరుపతికి 26వ ర్యాంకు, అమిటీ యూనివర్సిటీకి 54వ ర్యాంకు, నైపర్‌-హైదరాబాద్‌కు 76వ ర్యాంకు, ట్రిపుల్‌ఐటీ-హైదరాబాద్‌కు 82వ ర్యాంకు, ఆంధ్రా యూనివర్సిటీకి 92వ ర్యాంకు, జేఎన్‌టీయూ కాకినాడకు 108వ ర్యాంకు, ఐఐటీ తిరుపతికి 122వ ర్యాంకు దక్కాయి. 2021 ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి.. ఈ ఏడాది మార్చి 31 మధ్య ప్రచురితమైన పరిశోధనపత్రాల ఆధారంగా నేచర్‌ జర్నల్‌ ఆయా ర్యాంకులను కేటాయించింది. ప్రధానంగా రసాయనశాస్త్రం, లైఫ్‌సైన్సెస్‌, భౌతికశాస్త్రంలో పరిశోధనలను ఆధారంగా తీసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని