తెలుగు రాష్ట్రాల్లో ‘సురవరం’ నాటక ప్రదర్శన

‘సురవరం’ (సురవరం ప్రతాప్‌రెడ్డి జీవిత చరిత్ర) నాటకాన్ని రెండు  రాష్ట్రాల్లో ప్రదర్శించనున్నట్లు ట్రస్టు సభ్యులు సురవరం కృష్ణవర్థన్‌, పుష్పలతలు బుధవారం వెల్లడించారు.

Updated : 18 Aug 2022 05:26 IST

రవీంద్రభారతి, న్యూస్‌టుడే: ‘సురవరం’ (సురవరం ప్రతాప్‌రెడ్డి జీవిత చరిత్ర) నాటకాన్ని రెండు  రాష్ట్రాల్లో ప్రదర్శించనున్నట్లు ట్రస్టు సభ్యులు సురవరం కృష్ణవర్థన్‌, పుష్పలతలు బుధవారం వెల్లడించారు. తెలంగాణ వైతాళికుడిగా ప్రసిద్ధి చెందిన సురవరం ప్రతాప్‌రెడ్డి 125వ జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలను తెలుగు సమాజానికి పరిచయం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. డా.డి.విజయభాస్కర్‌ సురవరం జీవితాన్ని నాటకంగా రచించగా..  బీఎంరెడ్డి దర్శకత్వంలో సిద్ధం చేశారు. ఈ నాటకాన్ని ఈ నెల 19న సాయంత్రం 7 గంటలకు వనపర్తి జిల్లా కేంద్రంలోని దాచ లక్ష్మయ్య ఫంక్షన్‌ హాల్‌లో ప్రదర్శిస్తారని, మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని