స్టార్టప్‌-20 ఎక్స్‌ గ్రూపు ఏర్పాటు

స్టార్టప్‌లపై అనుభవాలు, ఉత్తమ విధానాలను చర్చించేందుకు స్టార్టప్‌-20 ఎక్స్‌ ప్రత్యేక గ్రూపును స్టార్టప్‌-20 అధ్యక్షుడు చింతన్‌ వైష్ణవ్‌ ప్రారంభించారు.

Published : 30 Jan 2023 04:14 IST

ముగిసిన స్టార్టప్‌-20 ఆరంభ సమావేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: స్టార్టప్‌లపై అనుభవాలు, ఉత్తమ విధానాలను చర్చించేందుకు స్టార్టప్‌-20 ఎక్స్‌ ప్రత్యేక గ్రూపును స్టార్టప్‌-20 అధ్యక్షుడు చింతన్‌ వైష్ణవ్‌ ప్రారంభించారు. కొత్తగా ఏర్పాటుచేసిన ఈ గ్రూపు.. స్టార్టప్‌-20కి అనుబంధంగా నాయకులు, పారిశ్రామికవేత్తలు, నూతన ఆవిష్కరణకర్తలు, విద్యావేత్తలు, ఇన్‌క్యుబేషన్‌ నిపుణులు, మహిళలు, యువత, కళాకారులు, ఉద్యమ నాయకులు తదితరులను ఒకే వేదిక మీదకు తెచ్చేలా పనిచేస్తుందని తెలిపారు. భారత్‌ సారథ్యంలో జరగనున్న జీ-20 సమావేశాల్లో భాగంగా స్టార్టప్‌-20 గ్రూపు రెండు రోజుల ఆరంభ సమావేశాలు ఆదివారం హైదరాబాద్‌లో ముగిశాయి. రెండోరోజు సమావేశంలో పేటీఎం వ్యవస్థాపకులు విజయ్‌శేఖర్‌ శర్మ, యువర్‌స్టోరీ సీఈవో శ్రద్ధాశర్మ, సినీనటుడు, స్టార్టప్‌ పెట్టుబడిదారు సునీల్‌శెట్టి పాల్గొని స్టార్టప్‌ ప్రయాణంలో అనుభవాలను పంచుకున్నారు. స్టార్టప్‌-20 ఎక్స్‌ గ్రూపు ఏర్పాటయ్యాక నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశాల్లో పాల్గొన్న అతిథులు తమ అనుభవాలను వివరించడంతో పాటు వాటిని ఆన్‌లైన్లో రికార్డు చేశారు. అనంతరం స్టార్టప్‌-20 పరిధిలో ఏర్పాటైన మూడు టాస్క్‌ఫోర్స్‌లకు జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు నామినేషన్లు పూర్తిచేశారు. ఆపై వారు ట్యాంక్‌బండ్‌, గోల్కొండ కోటలను సందర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని