పీఎంజేఏవై లెక్కల్లో గందరగోళం

ఆయుష్మాన్‌ భారత్‌-ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన(ఏబీ-పీఎంజేఏవై) కింద తెలంగాణకు విడుదల చేసిన నిధులపై కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్‌ పవార్‌ భిన్నమైన సమాధానాలిచ్చారు.

Published : 29 Mar 2023 04:38 IST

రెండు రకాల జవాబులిచ్చిన కేంద్ర మంత్రి

ఈనాడు, దిల్లీ: ఆయుష్మాన్‌ భారత్‌-ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన(ఏబీ-పీఎంజేఏవై) కింద తెలంగాణకు విడుదల చేసిన నిధులపై కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్‌ పవార్‌ భిన్నమైన సమాధానాలిచ్చారు. భాజపా రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ ఏబీ-పీఎంజేఏవైపై రెండు ప్రశ్నలు వేర్వేరుగా అడిగారు. వాటికి కేంద్ర మంత్రి మంగళవారం వేర్వేరుగా లిఖితపూర్వక సమాధానాలిచ్చారు. ఒక ప్రశ్నకు తెలంగాణలో ఈ పథకం కింద 7,09,497 మంది ఆసుపత్రిలో చేరారని, వారి చికిత్సలకు అయ్యే మొత్తం వ్యయం రూ.1,984.53 కోట్లు అని, అందులో రూ.247.17 కోట్లు విడుదల చేశామని పేర్కొన్నారు. ఇదే అంశంపై అడిగిన మరో ప్రశ్నకు.. తెలంగాణలో ఈ పథకం కింద 7.09 లక్షల మంది ఆసుపత్రుల్లో చేరారని, వారి చికిత్సలకు అయ్యే మొత్తం వ్యయం రూ.2,012 కోట్లని, కేంద్ర ప్రభుత్వ వాటా కింద రూ.236.45 కోట్లు విడుదల చేశామని వెల్లడించారు. ఇలా మంత్రి గణాంకాల్లో తేడాలు చూపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు