TSLPRB: అన్ని దశలు దాటాక అభ్యర్థిత్వం రద్దు

తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) నియామక ప్రక్రియ తుది దశకు చేరుకున్న తరుణంలో కొందరు అభ్యర్థులకు చేదు అనుభవం ఎదురవుతోంది.

Updated : 28 Jun 2023 07:45 IST

ఆందోళనలో పలువురు పోలీస్‌ అభ్యర్థులు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) నియామక ప్రక్రియ తుది దశకు చేరుకున్న తరుణంలో కొందరు అభ్యర్థులకు చేదు అనుభవం ఎదురవుతోంది. ప్రాథమిక రాతపరీక్ష, శారీరక సామర్థ్య పరీక్షలు, తుది రాతపరీక్షల్లో నెగ్గుకొచ్చిన తర్వాత అభ్యర్థిత్వం చెల్లదంటూ మండలి తిరస్కరించడం పలువురు అభ్యర్థులకు అశనిపాతంలా మారుతోంది. వారి వయసు మీరడమే ఇందుకు కారణమని మండలి చెబుతుండగా.. తొలి దశలోనే ఎందుకు అభ్యంతరం చెప్పలేదని తిరస్కారానికి గురైన అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఈమేరకు మండలికి వినతులు వెల్లువెత్తుతున్నాయి.  వాస్తవానికి మండలి జారీ చేసిన నోటిఫికేషన్‌లో అభ్యర్థుల వయసు అర్హతల గురించి స్పష్టంగా పేర్కొన్నారు. నిర్ణీత వయసుకు లోబడినవారే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. దరఖాస్తు సమయంలోనే ధ్రువీకరణ పత్రాల్ని వడబోయడం శ్రమతో కూడుకున్నది కావడంతో వయసు సహా అన్ని ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను మండలి చివర్లో చేపట్టింది. అదే ఇప్పుడు సమస్యకు  కారణమైంది. నిర్ణీత వయసు లేనివారు దరఖాస్తు చేసినప్పుడే తిరస్కరణకు గురైతే ఇబ్బంది ఉండేది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని