KCR: కేసీఆర్‌ భద్రత జడ్‌ నుంచి వై ప్లస్‌కు కుదింపు

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ భద్రతను జడ్‌ కేటగిరి నుంచి వై ప్లస్‌కు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి 1+4 చొప్పున రెండు షిఫ్టుల్లో కలిపి 2+8 మంది భద్రత సిబ్బంది ఉండనున్నారు.

Updated : 16 Dec 2023 07:49 IST

నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి వై ప్లస్‌ నుంచి వై కేటగిరీకి తగ్గింపు

ఈనాడు, హైదరాబాద్‌: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR) భద్రతను జడ్‌ కేటగిరి నుంచి వై ప్లస్‌కు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి 1+4 చొప్పున రెండు షిఫ్టుల్లో కలిపి 2+8 మంది భద్రత సిబ్బంది ఉండనున్నారు. కేసీఆర్‌ నివాసం వద్ద నిరంతరం గార్డుల కాపలా ఉంటుంది. పరిసరాల్లోనూ మఫ్టీలో సిబ్బంది ఉంటారు. బయటికి వెళ్లినప్పుడు పైలట్‌ ఎస్కార్ట్‌ భద్రత యథావిధిగా కొనసాగనుంది. చట్టసభల ప్రతినిధులు మాజీలుగా మారిన అనంతరం భద్రతను కుదించే ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ముఖ్యమంత్రిగా ఎన్నికైన వారికి జడ్‌ కేటగిరి భద్రత కల్పిస్తారు. తాజా మాజీ ముఖ్యమంత్రికి వై ప్లస్‌కు తగ్గిస్తారు. అదే సమయంలో వీరిద్దరి కంటే ముందు ముఖ్యమంత్రిగా చేసిన వారి భద్రత వై కేటగిరీకి తగ్గుతుంది. అందులో భాగంగా కేసీఆర్‌ కంటే ముందు ముఖ్యమంత్రిగా ఉన్న నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఇప్పటివరకు ఉన్న వై ప్లస్‌ భద్రతను వై కేటగిరీకి కుదించారు. మావోయిస్టులతో ముప్పు పొంచి ఉండటం లాంటి ప్రత్యేక సందర్భాల్లో భద్రతను యథావిధిగా కొనసాగించే అవకాశముంది. కాగా ఇప్పటికే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు భద్రతను తగ్గించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని